Big Boss Season7: కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగే వినోదభరితమైన బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది.. అందులోని కంటెస్టెంట్స్ వీళ్ళే..
కింగ్ నాగార్జున యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్ బాస్. దీని ఏడవ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. సీనియర్ నటుల నుంచి యూట్యూబర్ల వరకూ రకరకాల రంగాల వారు ఈ హౌస్ లో పాల్గొన్నారు. ఈ సారి అన్నీ ఉల్టా.. పల్టా అని ట్యాగ్ లైన్ తో ముందుకొచ్చిన షో ప్రేక్షకులను ఏమాత్రం వినోదాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

ఈమె పేరు ప్రియాంక జైన్. వినరో సోదర వీర కుమార అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తాజాగా సీరియల్స్ లో నటిస్తున్నారు

హీరో శివాజీ. కామెడీ సినిమాలు చేస్తూ తాజాగా రాజకీయాలపై ప్రెస్ మీట్లు ఏర్పాట్లు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈమె పేరు ధామిని భట్ల. ప్రముఖ సింగర్. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసినా.. పిల్లగాడ అనే పాటతో పాపులర్ అయ్యారు

ప్రిన్స్ యవార్ తన కండలతో అమ్మాయిల మనసులు దోచుకుంటూ.. బుల్లితెరపై చాలా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఈమె పేరు శుభశ్రీ రాయగురు. ఒక లాయర్ గా, మోడల్ గా, సినిమాకి అసిస్టెంట్ గా పని చేసి 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి కిరీటాన్ని దక్కించుకున్నారు.

తెలుగు, మలయాళ సినిమాల్లో చూసిన వెంటనే గుర్తుపట్టేంత స్టార్ డం ను సంపాదించుకున్న నటి షకీలా.

ఇతని పేరు సందీప్ అయినప్పటికీ ఆట షో చేసి ఆట సందీప్ గా మారిపోయారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా అందరికీ తెలుసు

శోభా శెట్టి సీరియల్స్ లో ప్రత్యేక క్యారెక్టర్లు చేస్తూ బుల్లితెర రమ్యకృష్ణగా పేరు తెచ్చుకున్నారు. కార్తీక దీపం తో తెగ ఫేమస్ అయ్యారు

యూట్యూబర్ టేస్టీ రాజా గా గుర్తింపు తెచ్చుకున్నారు

రతిక రోజ్ సోషన్ మీడియా ఇన్ ప్లూయెన్సర్, సినిమా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

డాక్టర్ గౌతం కృష్ణ ఆకాశ వీధుల్లో అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.

కిరణ రాథోడ్ తెలుగుతో పాటూ తమిళ, హిందీ, మలయాళ సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నారు.

పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో వ్యవసాయం గురించి వీడియోలు చేస్తుంటారు.

అమర్ దీప్ సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.