Kriti Sanon: కత్తి లాంటి అందాలతో కైపెక్కించే కృతి సనన్
కత్తి లాంటి అందాలు కృతి సనన్ సొంతం. ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా నటిస్తున్న కృతి సనన్.. బాలీవుట్ టాప్ స్టార్స్ లో ఒకరు. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.

కృతి సనన్ 1990 జులై 27న ఢిల్లీలో జన్మించారు.

కృతి సనన్ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్.

పంజాబీ కుటుంబమే అయినా చాలా కాలం క్రితమే వారి కుటుంబం ఢిల్లీలో సెటిల్ అయింది.

జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

స్టడీస్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె మోడలింగ్ చేశారు.

కృతి సనన్ సోదరి నుపూర్ కూడా యాక్ట్రెస్ గా ఉన్నారు.

Kriti

తెలుగులో 1 నేనొక్కడినే సినిమా ద్వారా ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు కృతి సనన్ కు తొలిసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది.

తెలుగులో అడుగు పెట్టినా ఆ తర్వాత ఆమె ఎక్కువగా హిందీ సినిమాలే చేశారు.

2021లో రిలీజైన మిమి సినిమాకు కృతి సనన్ కు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది.

నాగ చైతన్యతో జతగా దోచేయ్ అనే సినిమా కూడా చేశారు కృతి సనన్.

కృతి సనన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ లో బిజీగా ఉంటున్నారు.

కోకాకోలా, టైటన్, పారాచ్యూట్, టిస్సాట్ లాంటి అనేక కంపెనీలకు ఆమె పనిచేశారు.

2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెర్మనీలో కృతి సనన్ పాల్గొన్నారు.

మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ కు కృతి సనన్ మోడల్ గా పనిచేశారు.

2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్టులో కృతి సనన్ చోటు దక్కించుకున్నారు. ఆమెకు 38వ ప్లేస్ దక్కింది.

2022 GQ ఇండియా మోస్ట్ 30 ఇన్ ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ లిస్టులో కృతి సనన్ స్థానం సంపాదించారు.

సోషల్ మీడియాలో కృతి సనన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 50 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

2016లో కృతి సనన్ సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ ను ఇంట్రడ్యూజ్ చేశారు. మిస్ టేకన్ పేరుతో ఆమె బ్రాండ్ కొనసాగుతోంది.

ట్రైబ్ అనే ఫిట్ నెస్ స్టార్టప్ కంపెనీలో కూడా అమె పెట్టుబడులు పెట్టారు

ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. ప్రభాస్ - కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.