Lake Front Park: నెక్లెస్ రోడ్డులో మరో ఆహ్లాదకరమైన పార్క్.. త్వరలో ప్రారంభం
నెక్లెస్ రోడ్డులో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. ఈ పార్కు అభివృద్ది కోసం సుమారు రూ. 22 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు అధికారులు. ల్యాండ్ స్కేప్, ఎలక్ట్రిక్ పనుల కోసం రూ. 4.65 కోట్లను వెచ్చించారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకూ తెెరిచి ఉంటుంది. పిల్లలకు రూ. 10, పెద్దలకు రూ. 50 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. డైలీ వాకర్స్ కి నెలకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

హుస్సేన్ సాగర్ లో లేక్ ఫ్రంట్ పార్క్ ను నిర్మించారు

చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం

హుస్సేన్ సాగర్ నీటిని దగ్గర నుంచి చూసేందుకు వీలు ఉంటుంది

లేక్ వ్యూ పార్క్ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ చేపట్టింది

అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో నిర్మించారు

నడిచేందుకు సువిశాలమైన ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు

సుమారు 10 ఎకరాల్లో 25.65 కోట్ల వ్యయంతో నిర్మించారు

ప్రత్యేక ఆకర్షణీయంగా మారిన ఎలివేటెడ్ వాక్ వేస్

ఒక్కో వాక్ వే 110 మీటర్లు దూరం ఉంటుంది

రాత్రి పూట అత్యంత సుందరంగా కనిపిస్తున్న నెక్లెస్ రోడ్డు

సాగర తీరంలో విహరించేందుకు అనువుగా నిర్మించారు

సేద తీరేందుకు షెడ్లు నిర్మించారు

నాలుగు ఎలివేటెడ్ వాక్ వేస్ ఉన్నాయి

నక్లెస్ రోడ్డుకే అందాన్ని తెచ్చేలా దీనిని చేపట్టారు

పెవిలియన్స్, పంచతత్వ వాక్ వేస్, సెంట్రల్ పాత్ వే, అండర్ పాస్ లు ఉన్నాయి

నాలుగు లక్షల మొక్కలు, 40 ప్రత్యేక మొక్కలు ఉన్నాయి