Lalbaghcha Ganesh festival : లాల్బాగ్చా దర్బార్.. గణేష్ ఉత్సవ చరిత్ర..
దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు జరిగినప్పటికి గణేశ్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది మాత్ర మాహారాష్ట్రలోని లాల్ బాగ్చా దర్బార్ మాత్రమే.. లాల్బాగ్చా రాజా చరిత్ర ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం..

గణేష్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా దర్బార్.

భాదపద్ర మాసంలో ఈ పండుగ వస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాలు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

మహారాష్ట్రలో మాత్రం గణేష్ ఉత్సవాలు కాస్త భిన్నంగా నిర్వహిస్తారు.

మహారాష్ట్రలో ఉన్న లాల్బాగ్చా రాజా చాలా వినాయక ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది.

లాల్బాగ్చా రాజా అంటే లాల్బాగ్ రాజు. దీని వెనుక ఓ ప్రత్యేక కథనమే ఉంది.

1930లలో పారిశ్రామికీకరణ సమయంలో అక్కడి వస్త్ర కార్మికులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

వస్త్ర కార్మికులు అందరూ అక్కడి గణపతి ని బప్పాను వేడుకున్నారు.

అప్పటి నుండి అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని బప్పా ఆశీర్వాదంగా భావించారు.

లాల్బాగ్చా రాజా విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను కాంబ్లీ కుటుంబం తీసుకుంది.

1934 నుండి నేటి వరకు ఈ కుటుంబాలు లాల్‌బాగ్‌లోని గణపతి విగ్రహాన్ని తయారు చేసి వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.