Latest Movies: ఎన్నెన్నో చిత్రాలు..కొన్నింట కొత్తోళ్లు..!
2023లో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్ పోస్టర్ ని విడుదల చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

ఈ సారి మీ ఊహలకు మించి’ అంటూ బాలకృష్ణ తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి.. తమన్న.. కీర్తి సురేష్ ప్రదాన పాత్రలో కలిసి నటిస్తున్న భోళాశంకర్ టీం శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల తేదీతో రిలీజ్ చేశారు.

నాని ఊరమాస్ లుక్ లో ఇప్పటికే ప్రమోషన్స్ జరుపుకుంటున్నాడు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కీర్తీ సురేష్, నాని కలిసి దిగిన ఫోటోను పబ్లిష్ చేశారు.

గత రెండు నెలలుగా ఊరిస్తున్న శ్రీనాధుని కావ్యం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల అంటూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ధీర పేరుతో సరికొత్త తారాగణం కలిసి నటిస్తున్న చిత్ర పోస్టర్ ని విడుదల చేశారు.

కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం డెవిల్. ఈసినిమాలోని సరికొత్త లుక్ చూపించారు.

నాగచైతన్య, కృతిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం కస్టడీ. ఉగాది శుభాకాంక్షలతో పాటూ సినిమా 2023, 12మే న రానున్నట్లు విడుదల తేదీని ప్రకటించారు.

కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అంటూ క్యాచీ టైటిల్ తో కొత్త తారలు కలిసి తీస్తున్న చిత్రానికి సంబంధించిన ఫోటోను రిలీజ్ చేశారు.

గోపిచంద్ సరసన హైదరాబాదీ ముద్దుగుమ్మ డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా.. జగపతి బాబు తదితరులు కలిసి తెరకెక్కనున్న చిత్రం రామబాణం.

అన్నపూర్ణ ఫోటో స్టూడియో టైటిల్ తో చిత్ర యూనిట్ త్వరలో మీముదుకు అని సమాచారాన్ని ఇస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం గోస్ట్. వీరు కూడా ఉగాది సందర్భంగా యాక్షన్ సీన్ లోని ఫోటోను విడుదల చేశారు.

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. ఫాంటసీ చిత్రంగా రానుందని చెబుతూ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

ఉమాపతి అనే పేరుతో సినిమమాను తీస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను ఉగాది సందర్భంగా విడుదల చేశారు.

రంగబలి సినిమాలో నాగశౌర్య హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రోడ్యూసర్లతో పాటూ ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారని సింబాలిక్ గా తమ పేరు క్రింద ఊరు పేరును చెప్పుకొచ్చారు. చివరగా ఉగాది శుభాకాంక్షలు అని వీడియో ముగుస్తుంది.