Sudarshan Sethu : భారత దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్..
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా (narendra Modi) ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు (Sudarshan Setu Bridge)బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ (narendra Modi)ప్రారంభించారు. మొదటగా ప్రధాని బీట్ ద్వారక లోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత మోదీ తన రోజును ప్రారంబించారు.

బేట్ ద్వారకా ద్వీపాని సందర్శించి ప్రధాని మోదీ ప్రదక్షనాలు చేశారు.

మొదటగా ప్రధాని బీట్ ద్వారక లోని శ్రీకృష్ణుడి ఆలయంలో పూజలు చేశారు.

శ్రీకృష్ణునికి మంగళ హారతి ఇచ్చిన ప్రధాని మోదీ.

అనంతరం ప్రధాని మోదీ శ్రీకృష్ణుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

సుదర్శన్ సేతు వంతెనను ఓఖా - బెట్ ద్వారకా బ్రిడ్జ్ గానూ పిలుస్తారు.

ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ ప్రారంభించారు.

సుదర్శన్ సేతు ప్రత్యేకమైన డిజైన్లతో నిర్మాంచారు.

ఈ వంతనెపై భగవద్గీతలోని శ్లోకాలు, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలతో అలంకరించబడిన కాలిబాట కూడా ఉంది.

2017 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ వంతెనకు శంకుస్థాపన చేశారు.

సుదర్శన్ సేతు భారత దేశంలోనే అతిపొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది.

ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.

ఈ వంతెన వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు) ఉంటుంది. వంతెన ఇరువైపులా 2.5 మీటర్లు (8అడుగులు) వెడల్పు గల పుట్ పాత్ ఉంది.

ఈ వంతెన నిర్మితం కావడంతో భక్తులు.. కష్టాలు తీరనున్నాయి.

గతంలో బేట్ ద్వారక కు చేరుకోవలంటే కేవలం పడవపైనే ఆధారపడాల్సి వచ్చేది.

రాత్రి సమయంలో సముద్రం పై విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న బీట్ ద్వారక సుదర్శన్ సేతు