Chandrayaan3 (ISRO) : చంద్రయాన్ 3 బృందాన్ని అభినందించిన ప్రధాని మోదీ..
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావత్ భారతం సలాం చేస్తుందన్నారు. 140 కోట్ల భారతీయులంతా మీరు సాధించిన విజయాన్ని చూసి గర్విస్తున్నారు.

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు.

మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో జాతీయ జెండాలతో ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు.

HAL విమానాశ్రయం వెలుపల, ISTRAC కి దగ్గరగా ఉన్న జలహల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున మోదీకి ప్రజలు స్వాగతం పలికారు.

ఇదివరకు ఇంటింటికీ జాతీయ జెండా మాత్రమే.. ఇప్పుడు చంద్రునిపైన కూడా మన జాతీయ జెండా ఎగురుతోందన్నారు.

చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్త లను అభినందించారు.

చంద్రయాన్-3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు.

ఇస్రో విజయం అసాధారణం.. శాస్త్రవేత్తలకు సెల్యూట్.. మోదీ

ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని.

ప్రధాని మోదీని చూసేందుకు చిన్న పిల్లలు సైతం తరలివచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.


ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ కార్యాలయానికి రోడో షో నిర్వహించారు మోదీ.

ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు మోదీ అభినందనలు .

చంద్రయాన్-2 వైఫల్యం తో మనం వెనకడుగు వేయలేదన్నారు.

చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.

చంద్రయాన్ 3 ల్యాండర్ పని తీరును మోదీకి వివరిస్తున్న సోమనాథ్

మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహం ఈ విజయం

శాస్త్రవేతలకు అభివాదం చేస్తు ఇస్రోలోకి అడుగు పెట్టిన మోదీ

ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ల్యాండర్ తీసిన తొలి ఫోటోను సోమనాథ్ మోదీకి బహుకరించారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆదిత్య ఎల్1, గగన్యాన్ల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి గ్రూప్ ఫోటో..