Morocco Earthquake : మొరాకోలో మ్రోగిన.. మృత్యుఘోష ( మొరాకోలో భూకంపం )
మొరాకో ఉత్తర ఆఫ్రికా దేశంలోని ఒక ప్రాంతం. ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, ఇటుకలతో నిర్మించిన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పర్యాటక ప్రదేశం. నేడు ప్రకృతి ఒడిలో.. మృత్యు తాండవం. మొరాకో భూకంపం దాటికి 2 వేలకు పైగా మంది దుర్మరణం..

Morocco is a region of North African country Natural beauty high hills and brick buildings make it a tourist destination A huge earthquake occurred in Morocco 2000 people died in this incident
- ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు సంభవించడం చాలా అరుదు.
- స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
- 1960 లో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చరిత్ర చెబుతోంది.
- శిధిలాల కింద కొన్ని వేల మంది క్షతగాత్రులు చిక్కుకుపోయారు.
- మొరాకోలో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సంభవించిన భూకంపం
- తీరప్రాంత నగరాలైన రాబాట్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.
- పర్యాటక ప్రాంతమైన మరకేశ్కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
- ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన తన కుటుంబీకులను తలుచుకుంటూ ఘోషిస్తున్న మహిళ
- ఈ దేశంలోని ప్రకృతి విలయంతో అనేక చారిత్రక ప్రాముఖ్యమైన పురాతన కట్టడాలు ధ్వంసమయ్యాయి.
- మొరాకో మొత్తం GDPలో రెండు శాతం నష్టం జరిగిందని అమెరికన్ ఏజెన్సీ అంచనా వేసింది.
- మొరాకోలో ఎటు చూసిన శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి.
- దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు.
- ఈ భూకంపం ధాటికి 1,200 మంది క్షతగాత్రులయ్యారని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
- సైనికులు శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నారు.
- శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- మరకేష్-సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి. దాదాపు 45 లక్షల మంది ప్రభావితులయ్యారు.
- మృతదేహాన్ని తీసుకొస్తున్న ఆర్మీ సిబ్బంది.
- శిథిలాల నుంచి బయటకు తీసిన పదేళ్ల బాలిక మృతదేహం.
- 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 2,059 మంది గాయపడ్డారు.
- మొరాకోలో భూకంపం.. రూ.23 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థ నాశనం