Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్
హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

ఫౌంటేన్ గురించి మాట్లాడుతున్న నగర మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి

అద్భుతమైన కాంతులతో నీటి ధారల విన్యాసాలు

కన్నుల పండువగా సాగిన సాయంత్రం

పర్యాటక దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు

తెలంగాణను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి

రంగు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు

చూసేందుకు తరలి వచ్చిన నగరవాసులు

దిల్ షేప్ లో అలంకరించిన లైటింగ్

దాదాపు 60 మీటర్ల పొడవులో దీని నిర్మాణాన్ని చేపట్టారు

మారుతున్న మ్యూజిక్ కి అనుగుణంగా నీటి ధారలు కదులుతూ ఉంటాయి

ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ ఫౌంటెన్ షో ఉంటుంది

నగర వాసులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఇవి ఏర్పాటు చేశాన్న మేయర్

పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే

హైదరాబాద్ లో మాత్రమే కాకుండా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు