PM Narendra Modi: అస్సాం జానపద నృత్యానికి అరుదైన రికార్డ్ వరించింది..
వేల మంది కళాకారులతో అస్సాం జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఇందుకు గానూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు గిన్నిస్ రికార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

అస్సాంలోని గువహటిలోని సరుసజై మైదానంలో 11,304మంది జానపద కళాకారులు నృత్యం చేశారు

ఇందులో ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు

బిహు నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందిన జానపదకళ

అందరినీ తన చేత్తో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ.

ఈ అస్సాం వేదికగా జరిగిన సంప్రదాయ నృత్యం బిహు గిన్నిస్ రికార్డుల్లో చేరింది.

బిహు అనే డాన్స్ లో డోలు, తాల్, పెపా(ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం) ఉపయోగిస్తారు

మైదానంలో ఒక శకటాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానితో పాటూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు

కళాకారలును ఉద్దేశించి ప్రసంగించిన మోదీ

ఈ నృత్యంలో నాట్యకారులు అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు.

11,304మంది జానపద కళాకారులు నృత్యం చేయగా.. 2,548 మంది డ్రమ్ములు వాయించారు. దీంతో ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు చేరింది.