Ritu Varma Gallery: మనసు దోచే అందం.. రీతూ వర్మ సొంతం

రీతూ వర్మ 1990 మార్చి 10న హైదరాబాద్ లో జన్మించారు.

Ritu Varma

రీతూ వర్మ నాన్నది మధ్యప్రదేశ్. ఇంట్లో అందరూ హిందీ మాట్లాడుతారు. రీతూ వర్మ తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడగలతు. ఈ మధ్య తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది.

విల్లా మేరీ కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన రీతూ వర్మ.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారు.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆమె మోడలింగ్ వైపు వెళ్లారు. మిస్ హైదరాబాద్ పోటీల్లో ఆమె ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు.

రీతూ వర్మ నటించిన అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ అనేక ప్రశంసలు అందుకుంది. ఇది కాన్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో కూడా ప్రదర్శితమైంది.

మొదట్లో షార్ట్ ఫిల్మ్ లు, సపోర్టింగ్ రోల్స్ చేసిన రీతూ వర్మ.. ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో రీతూ వర్మ నటించింది.

బాద్షా రీతూ వర్మ తొలి సినిమా. ఇందులో పింకీగా సపోర్టింగ్ రోల్ చేసింది.

ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో శ్రీవిష్ణు సరసన నటించింది. అనంతరం రాకుమారుడు సినిమాలో కీలక పాత్ర పోషించింది.

2014లో నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాకు రీతూ వర్మకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు లభించింది.

2016లో రిలీజైన పెళ్లి చూపులు రీతూ వర్మకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆమె ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా చేజిక్కించుకుంది.

హద్దులు దాటకుండా ట్రెండీగా కనిపిస్తూనే కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతోంది రీతూ వర్మ.

సినిమా చాన్సులు బోలెడు వస్తున్నా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది రీతూ వర్మ. పెళ్లి చూపులు తర్వాత రీతూ వర్మకు మంచి హిట్ రాలేదనే చెప్పొచ్చు.

రీతూ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫ్యాన్స్ తో అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవలికాలంలో రీతూ వర్మ కూడా కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రీతూ వర్మ తమిళంలో ధృవనక్షత్రం సినిమాలో నటిస్తోంది