RTC Protest: రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులు
ఉదయం నుంచే రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేసిన ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై ఆమోదం తెలపాలని డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా నిరసన సెగ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు.

ఉదయాన్నే రాజ్ భవన్ ముట్టడికి సిద్దమైన ఆర్టీసీ ఉద్యోగులు

వివిధ డిపోల వద్ద గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు

ఉదయం 6 గంటల నుంచి 8 వరకూ స్థంభించిన ఆర్టీసీ బస్సులు

పీవీ మార్గ్ చేరుకునేందుకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికులు

భారీ సంఖ్యలో చేరుకున్న ఎంప్లాయిస్

తమ గళాన్ని వినిపించిన మహిళా కండెక్టర్లు

ఐమాక్స్ ఇందిరా బొమ్మ నుంచి రాజ్ భవన్ వరకూ నడుచుకుంటూ వచ్చారు

అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు

రాజ్ భవన్ వద్ద కవరేజ్ ఇచ్చేందుకు చేరుకున్న మీడయా ప్రతినిధులు

ఉదయం నుంచే భద్రతా బలగాల మొహరింపు

ప్రత్యేక సిబ్బంది నియామకం

బిల్లు ఆమోదించాలని ముక్తకంఠంతో విలిపిస్తున్న మహిళలు

చేతిలో ప్లకార్డ్‌లు పట్టుకొని రాజ్ భవన్ ముట్టడి

నల్గొండ తో పాటూ వివిధ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోల వద్ద ఆందోళన చేపట్టారు

గవర్నర్ తమిళసై.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సంతకం చేయాలని డిమాండ్