Samantha Latest Gallery: పడిలేచిన కెరటం సమంత – ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న ధీర వనిత
సమంత త్వరలో మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. మళ్లీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సమంత 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఆమె పూర్తి పేరు సమంత రుత్ ప్రభు.

సమంత తండ్రి తెలుగు వ్యక్తి. ఆయన పేరు జోసెఫ్ ప్రభు. తల్లి మలయాళీ. ఆమె పేరు నినెట్టె ప్రభు.

వీరికి ముగ్గురు సంతానం. సమంతకు జొనాథన్, డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.

చెన్నైలోనే సమంత విద్యాభ్యాసమంతా గడిచింది. ఆమె కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

చదువుకుంటున్న సమయంలోనే నాయుడు హాల్ అనే సంస్థకు సమంత మోడలింగ్ చేసేవారు. ఆ సమయంలోనే ఆమె సినీ ప్రముఖుల కంట పడ్డారు.

2007లో సమంత తొలి సినిమాకు సైన్ చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. 2010లో వచ్చిన ఏ మాయ చేశావే ఆమె తొలి సినిమాగా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత బృందావనం, ఈగ, దూకుడు, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, రంగస్థలం, మహానటి, ఓ బేబీ,.. లాంటి అనేక సినిమాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లో కూడా సమంత నటించారు.

ఏమాయ చేశావే సినిమాకు ఆమెకు సౌతిండియా ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది.


సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ లో కీలక పాత్ర పోషించారు.

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో శామ్జామ్ షో నిర్వహించారు కూడా.

ఏమాయ చేశావే సినిమా సమయంలోనే నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు సమంత. ఆ తర్వాత వీళ్లిద్దరూ 2017 అక్టోబర్ 6,7 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లిద్దరూ 2021 అక్టోబర్ 7న విడిపోయారు.

సమంత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రకటనల ద్వారా వచ్చే డబ్బుతో ఆమె ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. అనాథలు, పేద పిల్లలను విమానం ఎక్కించడం, వారికి వైద్య సహాయం అందించడం లాంటివి చేస్తుంటారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేనేత కార్మికుల సంక్షేమం కోసం సమంత పని చేస్తున్నారు.

2022లో నయనతార తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే తారగా సమంత నిలిచారు.

ఇటీవల సమంత మయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధిబారిన పడ్డారు

మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా శ్రమించారు


సమంత ఫైటర్ గా పేరొందారు. ఎలాంటి సమస్యలనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలరని పేరు తెచ్చుకున్నారు.

వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగకపోయినా ఆమె ఏనాడూ వెనుకంజ వేయలేదు. మొండిగా ముందుకెళ్లారు.

అనారోగ్య సమస్యలు ఎదురైనా పట్టుదలతో దాన్ని అధిగమించారు. వ్యాధిబారిన పడిన సమంతను చూసి ఆమె అభిమానులందరూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు మిలియన్లలో ఫాలోయర్స్ ఉన్నారు.