Mrunal Thakur Gallery | రెచ్చిపోతున్న సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ | గ్యాలరీ |

మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు

జలగావ్, ముంబైలలో మృణాల్ ఠాకూర్ విద్యాభ్యాసం గడిచింది.

మృణాల్ ఠాకూర్ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించారు.

ఇటీవలే ఆమె మరాఠీ, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు.

మృణాల్ ఠాకూర్ మొదట సీరియళ్లలో నటించారు. ఆమె తొలి సీరియల్ ముజ్ సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్! ఆ తర్వాత కుంకుమ్ భాగ్య సీరయల్ కూడా నటించారు.

2015లో మృణాల్ ఠాకూర్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టింగ్ అవార్డ్ దక్కింది.

2018లో లవ్ సోనియా సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించారు

సూపర్ 30, బాట్లా హౌస్ సినిమాలు మృణాల్ ఠాకూర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి

2014లో విట్టి దండు, సురాజ్య సినిమాల ద్వారా మరాఠీరంగ ప్రవేశం చేశారు మృణాల్ ఠాకూర్.

2022లో సీతారామం సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

త్వరలో ఆమె నానితో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు

ఈస్టర్న్ ఐ నిర్వహించిన గ్లోబల్ ఏషియన్ స్టార్స్ టాప్ 30 లిస్టులో మృణాల్ ఠాకూర్ 8వ స్థానంలో నిలిచారు

లాక్మే ఫ్యాషన్ వీక్ లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. పలు ఫ్యాషన్ మేగజైన్లలో మృణాల్ ఠాకూర్ కవర్ మోడల్ గా నిలిచారు

మృణాల్ ఠాకూర్ కు టీ, కాఫీ అంటే పిచ్చి. తైవాన్ రాజధాని తైపేలో డంపింగ్స్ తినడమంటే ఆమెకు చాలా ఇష్టం

జలగావ్ ఏరియాలో మాట్లాడే ఖందేషి భాషపై మృణాల్ ఠాకూర్ కు మంచి పట్టుంది. మహారాష్ట్రలో అతి తక్కువ మంది మాత్రమే ఈ భాష మాట్లాడతారు.

కాలేజీలో ఉన్నప్పుడే సినీరంగంపై ఇష్టం ఏర్పడింది. దీంతో కాలేజీకి డుమ్మా కొట్టి ఆడిషన్స్ కు వెళ్లిపోయేది. దీంతో ఆమెను కాలేజ్ నుంచి డీటెయిన్ చేశారు.

హాలీవుడ్ సినిమా మ్యాట్రిక్స్ లో ప్రియాంక చోప్రా నటించిన పాత్రకోసం మొదట మృణాల్ ఠాకూర్ ను అనుకున్నారు. ఆడిషన్స్ కూడా ఇచ్చింది. అయితే చివరకు మిస్ అయింది.

సినిమాల్లోకి రాకపోయి ఉంటే మృణాల్ ఠాకూర్ డెంటిస్ట్ గా స్థిరపడేది. ఎందుకంటే డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు రావడంతో ఆమెకు సీట్ వచ్చింది.

అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మృణాల్ ఠాకూర్ మంచి మేకప్ అండ్ హెయిర్ ఆర్టిస్ట్. ఆమె సోదరి లోచన్ ఠాకూర్ నుంచి ఆమె ఈ టెక్నిక్స్ నేర్చుకున్నారు.