Home » Photo-gallery » Srivari Brahmotsavam In Tirumala Was Scientifically Initiated It Will Be Held From 18th To 26th September At Tirumala Srivari Temple
Dialtelugu Desk
Posted on: September 19, 2023 | 12:15 PM ⚊ Last Updated on: Sep 19, 2023 | 12:15 PM
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకుఅంకురార్పణ.. మాడవీధుల్లో విశ్వక్సేనుడి ఊరేగింపు
వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.
ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు.
ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.
అంకురార్పణంలో నాటే పవిత్ర విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.
విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు.
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు.
అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం, పెద్దశేష వాహనం.
ఉదయం చిన్నశేష వాహనం, స్నపనతిరుమంజనం సాయంత్రం హంస వాహనం.
ఉదయం సింహ వాహనం సాయంత్రం ముత్యపుపందిరి వాహనం.
ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం.
ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడసేవ.
ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం.
సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభవాహనం.
రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం.
పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం సాయంత్రం ధ్వజావరోహణం.