Sikkim floods : సిక్కింను ముంచెత్తిన మెరుపు వేగపు వరదలు.. 14 మృతి, 102 మంది గల్లంతు.
సిక్కింను ముంచెత్తిన బీకర వరదలు. ఆకస్మిక వరదలతో భారీగా ప్రాణ, ఆస్తీనష్టం. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలోని తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో చుంగ్తాంగ్లోని 1200 మెగావాట్ల డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదల వల్ల నది తీరాన ఉన్న ఆర్మీ క్యాంప్ జవాన్లు సైతం కొట్టుకుపోయారు.

గాంగ్టక్ : భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది.

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. . దీంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి.

వర్షాలు, వరదల ధాటికి ఇప్పటివరకు 14 మంది పౌరులు మరణించారు.

22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి.

వారి ఆచూకీ కనిపెట్టేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సిక్కిం ప్రభుత్వం పేర్కొంది.

మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి.

జాతీయ రహదారికి ఆనుకుని ప్రవహిస్తున్న తీస్తా నది

సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న తీస్తా నది

పూర్తిగా దెబ్బతిన్న నది పరివాహక ప్రజల ఇళ్లు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీ వరదలతో కాలనీలు బురదమయం

రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయింది.

నది ప్రవాహానికి తెగిన చుంగ్తాంగ్ ఆనకట్ట

నది ప్రవాహానికి కొట్టుకుపోయిన జాతీయ రహదారి

సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది.

చుంగ్తాంగ్ ఆనకట్ట తేగడంతో భయంకగాంగ ప్రవహిస్తున్న తీస్తా నది

చుంగ్తాంగ్లోని 1200 మెగావాట్ల డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది.

వరదకు ముందు చుంగ్తాంగ్ డ్యామ్ చిత్రం.

బుధవారం చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారింది.

దెబ్బ తినక ముందు చుంగ్తాంగ్ డ్యామ్

నదీ ప్రవాహానికి విరిగిపడుతున్న కొండచరియలు

చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకాపోయిన దృశ్యం


భారీ వరదతో కొండ ప్రాంతా ఇళ్లు నేలమట్టం.

JCB సహాయంతో బాధితులను రక్షిస్తున్న NDRF బృందాలు

అక్కస్మిక వరదలతో లోయలోకి కింగిన ఇళ్లు

JCB సహాయంతో బాధితులను రక్షిస్తున్న NDRF బృందాలు

ఎత్తైన భవంతులను సైతం ముంచేస్తున్న వరదలు

పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి.

ముంపు ప్రాంతాలను నుంచి బాధితులను రక్షిస్తున్న NDRF బృందం

నది ప్రవాహంలో కొట్టుకుపోయిన ఎలక్ట్రిక్ పోల్

ముంపు ప్రాంతాలను నుంచి పర్యాటకులను తరలింపు

సురక్షితంగా బయట పడుతున్న స్థానికులు, పర్యాటకులు

నది ప్రవాహంలో చిక్కుకుపోయిన నలుగురు బాధితులు

సిక్కిం వరదల నుంచి ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీర జవాన్లు

వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 14 వంతెనలు కూలిపోయాయి.

ఈ ఫోటోతో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.