African : ఆఫ్రికాలోని లిబియాలో జల ప్రళయం..
డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలం. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో గుట్టలుగుట్టలుగా మృతదేహాలు. ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.

డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది.

ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.

టర్కీతో పాటు ఇతర దేశాలు రెస్క్యూ వాహనాలు, రెస్క్యూ బోట్లు, జనరేటర్లు, ఆహారం అందించేందుకు ముందుకొచ్చాయి.

డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడంతో ఇతర నగరాల్లోని మర్చురీలకు తరలింపు.

వరదల ధాటికి రెండు డ్యామ్ లు కొట్టుకపోయాయి.

వరదల వల్ల బాధితులకు సహాయం చేస్తూ ముగ్గురు ఐఎఫ్ఆర్సీ వాలంటీర్లు మృత్యువాత పడ్డారు.

ఎక్కడ చూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో మృతదేహాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి.

ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు.

కుటుంబాలకు కుటుంబాలు గల్లంతు.

మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.

వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో తుర్కియే, యూఏఈ, ఈజిప్టు, ట్యునీషియా, ఖతార్ నుంచి సహాయక బృందాలు చేపట్టారు.

మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేసింది.

వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోయాయి.

కొట్టుకుపోయిన భవనాలు, కనడనని రోడ్లు

లిబియా మానవతా సాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఐక్యరాజ్యసమితి కార్యాలయం పంపింది.