Aditya-L1 Mission : ఆదిత్యL1 మిషన్ కు అంతా రెడీ.. ( ఆదిత్య L1 ప్రత్యేకతలు )
ఈ ఏడాదిలో ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో..మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెడీ అయ్యింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ అయితే తదుపరి మిషన్ ను భారత్ సిద్ధం చేస్తుంది. అదే "ఆదిత్య L1"

ఆదిత్య L1 ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.

భారతదేశం యొక్క మొదటి సూర్య మిషన్ ఈ ఆదిత్య L1

ఆదిత్య ఎల్1 మిషన్ సూర్యుడిని అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత "అబ్జర్వేటరీ" భారతీయ సోలార్ మిషన్ అవుతుంది.

ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు

భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రవేశపెడతారు.

భూమి నుండి 1.5 మిలియన్ కి మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది.

ఆదిత్య- L1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణ, భూ వాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య– L1 పరిశోదన చేస్తుంది.

సౌర ఎగువ వాతావరణ ( క్రోమోస్పియర్ , కరోనా ) డైనమిక్స్ పై అధ్యయనం చేస్తుంది.