Tirumala: తిరుమలకు ఏమైంది..? ఓవైపు బారులు తీరిన క్యూలైన్లూ..! మరోవైపు ఎడతెరిపిలేని వర్షం..!
తిరుమలలో గత రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీనికి తోడూ భక్తులు లక్షల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్లమేరా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గురువారం మధ్యాహ్నం కురిసిన ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి. రెండు గంటల పాటూ కురిసిన వర్షానికి కొండల్లోని వరదనీరు జలపాతాలుగా మారి లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి.
1 / 12 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
2 / 12 

ఎటు చూసినా క్యూలైన్లు కనిపిస్తున్నాయి
3 / 12 

నారాయణగిరి ఉద్యానవనం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనికి అనుమతిస్తున్నారు
4 / 12 

రూములు దొరకక ఆరుబయట సేదతీరుతున్న భక్తులు
5 / 12 

మూడు కిలో మీటర్ల మేర బారులు తీరిన సర్వదర్శనం భక్లులు
6 / 12 

నాదనీరాజనం వేదిక వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చిత్రం
7 / 12 

తిరుమలలో అకాల వర్షం
8 / 12 

గత రెండు రోజులుగా ఉక్కపోతతో అవస్థలు పడుతున్న జనం
9 / 12 

మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించిన వరుణుడు
10 / 12 

రెండు గంటల పాటూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
11 / 12 

వర్షంలో తీవ్ర ఇబ్బందులకు గురైన యాత్రికులు
12 / 12 

శ్రీవారి ఆలయం బయట వర్షపు నీళ్లలో భక్లులు పరుగులు పెడుతూన్న దృశ్యం