Vande Bharath Express Features: గంటకు 120కి.మీ వేగంతో ప్రయాణించే రైలులోని సౌకర్యాలు..!

దేశ ప్రజలకు వందే భారత్ రైలు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

సుదూర ప్రయాణాలు చేసేవారికి ఈ రైలు అత్యంత సుఖవంతంగా ఉంటుంది. ఎక్కవ దూరం ప్రయాణం చేసినప్పుడు కలిగే విసుగు, చికాగు అనిపించదు.

స్టార్ హోటల్ లో లాగా అత్యంత అధునాతనమైన వాష్ రూం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో, ఏమైనా జరిగితే రైలులో ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన సౌకర్యాలు కూడా రైలులో ఉన్నాయి.

GPS ఆధారిత ఆడియో వీడియో సిస్టమ్, ఆటోమేటిక్ విండోస్, డోర్లు, ఆధునిక CCTV అన్ని సౌకర్యాలూ ఈ రైలులో ఉన్నాయి.

ఈ ఎక్స్ ప్రెస్ రైలులో సిట్టింగ్ ఇతర ఏసీ రైళ్ల కంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులోని అన్ని కోచ్లూ ఎయిర్ కండీషన్ తో ఉన్నాయి.

సరికొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలుగా చెప్తున్నారు అధికారులు.

ప్రస్తుతం అన్ని రైళ్లకంటే ఇదే అత్యంత వేగమైన రైలు కాబట్టి ప్రయాణికులకు ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.

సరికొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలుగా చెప్తున్నారు అధికారులు.