Home » Photo-gallery » Wonders Of Nature And Message Of Trees
Dialtelugu Desk
Posted on: February 12, 2023 | 07:17 AM ⚊ Last Updated on: Feb 13, 2023 | 12:44 PM
జీవితంలో ఏ స్థానమైనా ఒకరి తరువాత మరొకరిదే.. అనే అద్భుతమైన సందేశాన్ని నోరులేని వన సంపద మనకు ఇస్తున్న సూచన
మంటలు ఆర్పేందుకు ఉపయోగపడే ఫైర్ సర్వీస్ పైపులైన్ ను ఔట్ ఆఫ్ సర్వీస్ గా మార్చేసింది. ప్రకృతి తలుచుకుంటే దేనినైనా సర్వీస్ లో లేకుండా చేయగలదు అనే హెచ్చరికను తెలుపుతుంది.
ప్రపంచం మొత్తం అడవి, నీరుతో ఉంటుంది. అందులో మనం ఆవాసం ఏర్పరుచుకొని నివాసం ఉంటున్నాం. నేను తలుచుకుంటే ఎక్కడైనా దేనినైనా అధిగమించగలను అని కంచె వేసిన ఐరన్ పైపులను చెట్టు కప్పేస్తున్న దృశ్యం
తన సందేశాన్ని అందించడం కోసం మనం ఏర్పాటు చేసిన సందేశాన్ని మింగేస్తుంది. అంటే ప్రకృతి బాటలో మనం పయనించాలి తప్ప మన బాటలో ప్రకృతి రాదు అని చెప్పకనే చెబుతున్న సుందర చిత్రం
అడవులతో ఆట చెట్లతో వేట పనికి రాదు. మనం ఆడుకునే బాస్కెట్ బాల్ రింగును కూడా కనుమరుగు చేస్తుంది.
మోటార్ ఇంజన్ బాక్సులను మింగేస్తున్న చెట్టు మొదలు
నీటిని ఇచ్చే బోర్ పైపు లైన్ హైడ్రాంట్ ను అడ్డగించిన చెట్టు వేర్లు.
తన ఒడతో సేదతీరేందుకు రింగ్ బెంచ్ మధ్యలో పచ్చని నీడనిచ్చే చెట్టు పెరిగింది.
హెచ్చరిక బోర్డులను తనలోకి కలుపుకుంటున్న చెట్లు
చెట్టులోపలికి గాల్లో బుల్లెట్ బైక్ చొచ్చుకు పోయిన దీని పేరు మిస్టర్ ట్రీ.