Home » Photo-gallery » World Famous Buildings
Dialtelugu Desk
Posted on: February 6, 2023 | 10:58 AM ⚊ Last Updated on: Feb 08, 2023 | 4:38 AM
తలక్రిందులుగా వింతగా కనిపించే ఈ భవనం అమెరికాలోని ఓ రెస్టారెంట్. సందర్శకులను ఆకర్షించడం కోసం ఏర్పాటు చేశారు.
స్టెయిన్లెస్ స్టీల్ స్పైర్ మెరుపులతో కనిపిస్తున్న చిత్రం అమెరికాలోని మిస్సౌరీలో ఉంది. దీని ఎత్తు 300 అడుగులు. దీనిని ఇండిపెండెంట్ హౌస్ అంటారు. శాంతి సాధన కోసం దీనిని అంకితం చేయబడింది.
ఈ అద్భుతమైన డిజైన్ తో కనిపిస్తున్న చిత్రం షాంఘైలో ఉంది. దీనిని రైన్ బిల్డింగ్ అంటారు. చైనీస్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని 2010 సంవత్సరంలో బెటర్ సిటి బెటర్ లైఫ్ వరల్ఢ్ ఎక్స్ పో కు అనుగుణంగా నిర్మిచారు. క్రీడలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకోసం రూపొందించారు.
కృత్రిమంగా ప్రకృతి చేసిన మట్టిదిబ్బ నుండి ఐదు రెక్కల ఆకారంలో కలిగి ఉంది. ఈ టవర్లు థర్మల్ చిమ్నీల వలె కనిపిస్తాయి. దీనిని సాదియత్ ద్వీపం అంటారు. ఇది అబుదాబి, UAEలో ఉంది. ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతితో పాటూ సామాజిక, ఆర్థిక అంశాల గురించి ప్రదర్శించే మొదటి మ్యూజియం.
ఒక పెద్ద బుట్ట ఆకారంలో కనిపిస్తున్న ఆ భవనం పేరు బాస్కెట్ బిల్డింగ్. ఇది అమెరికాలోని ఓహియోలో ఉన్న లాంగ్ బెర్గర్ బాస్కెట్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం. ప్రపంచ వింత నిర్మాణాలలో ఇది ఒకటి. ఇవి ప్రస్తుతం నగరంలోని అత్యంత ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో ఒకటిగా మారింది. అద్భుతమైన డిజైన్‌తో కనిపిస్తున్న ఈ ప్రత్యేకమైన భవనంలో రెండు అటాచ్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి.
వినూత్నమైన సాంకేతికతలతో సహజమైన ఆకృతిని మిళితం చేస్తూ, కోడి గుడ్డు ఆకారంలో కనిపించే ఈ కార్యాలయ భవనం సందర్శకులకు ఆకర్షిస్తుంది. దీనిని ముంబాయ్ నగరంలో నిర్మించారు.
సాధారణంగా కనిపించే మరగుజ్జులను పోలిన ఆకృతిలో కనిపించే ఎర్త్ హౌస్. ఇవి నిజంగా కొండ ప్రాంతాలలో నిర్మించబడిన గృహాలు. ఈ నివాసంలో చాలా ఏళ్ల నుంచి ప్రజలు నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన ఇళ్లలో ఒకటి
ప్రాన్స్ నగరంలోని కేన్స్‌కు దగ్గరగా ఉన్న థియోల్-సుర్-మెర్లోని ఎత్తైననివాసం. దీనిని బబుల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఓ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త కోసం 1975 నుండి 1989 వరకు నిర్మించారు. 500 మంది కూర్చోగల విశాలమైన ఒపెన్ ఎయిర్ థియేటర్, 10 బెడ్ రూములు, అనేక స్విమ్మింగ్ ఫూల్స్ , జలపాతాలు ఇందులో ఉన్నాయి.
బార్సిలోనా నడిబొడ్డున ఉన్న కాసా బాట్లో ఆంటోని గౌడి యొక్క కళాఖండాలలో ఒకటి. అందమైన రంగులతో అద్భుతమైన నిర్మాణ వైభవంతో సందర్శకులను కట్టిపడేసే సుందరభవనం. దీనిని 1904లో గౌడిచే పున:ర్నిర్మించబడింది.
ఈ చిత్రం పేరు సిరామిక్ హౌస్. కాసా ఎర్రకోట అని కూడా అంటారు. దీనిని పూర్తిగా మట్టి ద్వారా చేతితో నిర్మించబడింది. ఎండలో ఎండిపోతుంది. కొలంబియాలోని రెగల్ పర్వత గ్రామంలో ఉన్న ఈ అసాధారణ నిర్మాణాన్ని స్థానికులు 'కాసా డి ఫ్లింట్స్టోన్' లేదా ఫ్లింట్స్టోన్ హౌస్ అని పిలుస్తారు. ఇది ఒక కుటీరంలా కనిపించేలా విశాలంగా ఉన్న పెద్ద మట్టి దిబ్బలా ఉంటుంది. ఈ విచిత్రమైన నిర్మాణం చుట్టూ పచ్చదనం ఉంటుంది. పచ్చని వ్యవసాయభూమితో పాటూ పర్వతాలకు ఎదురుగా దీనిని నిర్మించారు.