Yashobhoomi : భారత్ మండపం తరహాలో.. “యశోభూమి”
దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో యశోభూమి భవనం ను నిర్మించారు. 73,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమైన వాటితో సహా 15 సమావేశ గదులు ఉన్నాయి.

ఢిల్లీలో మరో అధ్బుతం "యశోభూమి" భవనం.

భారత్ మండపం తరహాలో ఢిల్లీలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ యశోభూమిని నిర్మించిన కేంద్రం.

వర్షం, మురుగు నీటిని శుద్ది చేసి వాడుకునేలా ఏర్పాట్లు.

8 అంతస్తుల ఈ యశోభూమిలో ఏకకాలంలో 11వేల మంది కూర్చోవచ్చు.

మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్టు వైశాల్యం.

15 కన్వెన్షన్ హోళ్లు, బల్ రూమ్, మీటింగ్ రూమ్స్, ఇన్సెంటివ్స్, ఎగ్జిబిషన్ హాల్స్ నిర్మాణం.

దీని నిర్మాణం భారతీయ సంస్కృతికి పెద్దపీట.

దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు యశోభూమి భవనం నిర్మాణం.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భవన నిర్మాణం.

రేపు ప్రధాని మోదీ "యశోభూమి" భవనంను ప్రారంభించనున్నారు.