Thrigun, Nivedita Marriage : ఓ ఇంటివాడు అయిన త్రిగున్
టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఆ వరుసలోకి మరో యంగ్ హీరో అయిన త్రిగున్ కూడా చేరాడు. ఇవాళ ఉదయం తమిళనాడులోని తిరుపుర్‌లో శ్రీ సెంతుర్ మహల్లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది.

త్రిగున్.. నివేదిత

తమిళనాడు తిరువూరులోని శ్రీ సెంథుర్ మహల్లో వెడ్డింగ్ ఈవెంట్లో త్రిగున్-నివేదిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్టు సమాచారం.

అదిత్ అరుణ్గా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు త్రిగున్.

2022లో తన పేరును త్రిగున్‌గా మార్చుకున్నాడు.

‘కథ’ అనే సనిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్‌కి పరిచయం.

ఆ తర్వాత పీఎస్వీ గరుడ వేగ, 24 కిస్సెస్, WWW, డియర్ మేఘ, ప్రేమదేశం, చిత్రాల్లో నటించాడు.

రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కొండా చిత్రంలో టైటిల్ రోల్ పోషించాడు.

పేరు మార్చుకున్న తర్వాత చేసిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కొండా’ చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం తెలుగు, తమిళ్లో పలు చిత్రాల్లో త్రిగుణ్ నటిస్తున్నారు.