నా పిల్లల మీద ఒట్టు… ప్రభాస్ ఎవరో తెలీదు, షర్మిల కన్నీళ్లు

తనపై నందమూరి బాలకృష్ణ ఇంట్లో కూర్చుని ప్రచారం చేసారని... తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె... కీలక వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2024 | 01:04 PMLast Updated on: Nov 22, 2024 | 1:04 PM

నా పిల్లల మీద ఒట్టు ప్రభా

తనపై నందమూరి బాలకృష్ణ ఇంట్లో కూర్చుని ప్రచారం చేసారని… తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె… కీలక వ్యాఖ్యలు చేసారు. నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో జగన్ చూపించారని… మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎం గా ఉన్నారు అప్పుడు గాడిదలు కాసారా? అంటూ జగన్ ను ఆమె ప్రశ్నించారు.

అప్పుడు దీనిపై ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అని జగన్ పై మండిపడ్డారు. ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా అని జగన్ ను సూటిగా ప్రశ్నించారు షర్మిల. మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరి నాకు తెలియదు అని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదన్న… జగన్ ఈ ప్రాపగండా తన పార్టీ నేతలతో చేయించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు.

జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారని… నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు చెల్లి పై దుష్ప్రచారం చేయిస్తారని సంచలన కామెంట్స్ చేసారు షర్మిల. పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో తనకు తెలియదు, డైరెక్ట్ గా కలవలేదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు.