మోదీ మీకు బాధ్యత లేదా..? షర్మిల ఫైర్

కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మంసుఖ్ మాండవీయలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాసారు. గౌరవ సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో EPS 95 పింఛనర్ల ప్రయోజనాలపై వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2024 | 05:36 PMLast Updated on: Nov 15, 2024 | 5:36 PM

మోదీ మీకు బాధ్యత లేదా షర్

కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మంసుఖ్ మాండవీయలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాసారు. గౌరవ సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో EPS 95 పింఛనర్ల ప్రయోజనాలపై వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని… కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ ఆలస్యం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఇది ప్రపంచంలోనే క్లయింట్ల సంఖ్య, ఆర్థిక లావాదేవీలు పరంగా అతిపెద్ద సంస్థగా గుర్తించబడిందని… పింఛనర్లు తగినంత పింఛన్లు అందక బాధకు గురవుతున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. 1990లలో ప్రవేశపెట్టిన ఈ పథకం కాలక్రమేణా తగ్గిపోయిందని పేర్కొన్నారు. రిటైర్ అయిన వారి నుండి రుసుములు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వద్ద నిల్వ ఉన్నాయన్నారు. అయితే ఒక సంవత్సర కాలంగా పింఛన్లు విడుదల చేయబడలేదని తెలిపారు.

స్పష్టంగా చెప్పాలంటే, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. మరి మోదీ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థత లేదా?అసలు బాధ్యత ఎవరిదీ? అని నిలదీశారు. గౌరవ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరియు గౌరవ కార్మికశాఖ మంత్రి శ్రీ మంసుఖ్ మాండవీయ గారికి తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ లేఖ రాయటం జరిగిందని పేర్కొన్నారు.