వాలంటీర్లను రద్దు చేయొచ్చు: పవన్
వాలంటీర్లపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.

వాలంటీర్లపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చన్నారు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరన్నారు పవన్. ఇదో సాంకేతిక సమస్య అని అన్నారు పవన్.