శ్రీవారికి అవమానం! కల్తీ లడ్డూ పాపం ఎవరిది? దోషి ఎవరు?
తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే చర్చ. ఇద్దరు హిందువులు కలిస్తే అదే డిస్కషన్. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కలుషితం చేసారట. కోటానుకోట్ల శ్రీవారి భక్తులంతా ఆరగించేందుకు పోటీలు పడే పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారట.
తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే చర్చ. ఇద్దరు హిందువులు కలిస్తే అదే డిస్కషన్. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కలుషితం చేసారట. కోటానుకోట్ల శ్రీవారి భక్తులంతా ఆరగించేందుకు పోటీలు పడే పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారట. లడ్డూ మాత్రమే కాదట శ్రీవారికి సమర్పించే నైవేద్యంలోనూ జంతువుల కొవ్వును కలిపారట. ఏమిటీ ఈ వైపరీత్యం అని భక్తగణం అంతా లెంపలు వేసుకుంటున్నారు. ఇక్కడితో చర్చ ఆగిపోయిందా అంటే లేదు.. నిజం చెప్పాలంటే ఇక్కడి నుంచే కీ పాయింట్ నోట్స్ తో డిస్కషన్ జరుగుతోంది. జగన్ స్వతహాగా బిలీవర్ కనుక అంటే… క్రిస్టియన్ కనుక తిరుమలను, శ్రీవారి కైంకర్యాలను,సేవలను,నైవేద్యాలను వాటి నాణ్యతను పట్టించుకోవాల్సిన రీతిలో పట్టించుకోని ఉండడు. అందుకే ఇదే అదనుగా భావించి అక్రమార్కులు రెచ్చిపోయి స్వామివారి సన్నిధిలో ఇంతటి దారుణ అపచారాలకు ఒడిగట్టి ఉంటారనేది ఒక వాదన అయితే… చంద్రబాబునాయుడు స్వయానా శ్రీవారి భక్తుడు. సమయం వచ్చినప్పుడల్లా తనకు తిరుమలేశుడు ఎంత ముఖ్యమో చెబుతూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడే కదా ఆనాడు నక్సల్స్ అటాక్ నుంచి చంద్రబాబు సురక్షితంగా బయటపడింది. ఇంతటి మహాభక్తుడు అంతకుమించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన అబద్దం చెబుతారా అనే ప్రశ్నలలో ప్రసాదం పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.
విన్నారు కదా సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ సంచలన ఆరోపణలే ఈ దుమారానికి కారణం. గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ NDDB, సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ CALF ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని… శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చేప నూనె, బీఫ్ ఆయిల్ తో పాటు ఇతర వ్యర్ధాలు ఉన్నాయనేది సారాంశం. ముందుగా NDDB ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ ల్యాబ్ రిపోర్ట్ రిఫరెన్స్ నెంబర్… AB0 21252. 17-07-2024న అంటే ఈ ఏడాది జులై 17న నెయ్యి శాంపిల్ ను తీసుకుని టెస్ట్ చేసారు. రిపోర్ట్ రిజల్ట్ వచ్చిన తేదీ 23-07-2024 అంటే…6రోజుల తర్వాత జులై 23న ఫలితం వచ్చింది. ఈ ఎపిసోడ్, నెయ్యి శాంపిల్స్ తీసిన పీరియడ్ సరిగ్గా రెండు నెలల క్రితం. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నది చంద్రబాబునాయుడు గారే.అలాంటప్పుడు ఈ అపచారం జరిగింది చంద్రబాబుగారి హయాంలోనే అని అర్ధం చేసుకోవాలా? అంతేకాకుండా జులై 23న ఫలితం వస్తే ఇన్నిరోజులు ఎందుకు దాచారు? ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి… జగన్ హయాంలో ఇంత దారుణం జరిగిందని చెప్పిఉండవచ్చు కదా, ఎందుకు కాలయాపన చేసారు అనేది అంతుచిక్కని ప్రశ్న. అంతేకాక NDDB రిపోర్ట్ ఆధారంగా… స్పందించిన TTD EO శ్యామలరావు… అధికారికంగా ఎక్కడైనా, ఎవరిమీద అయినా ఫిర్యాదు చేసారా? చేస్తే ఎవరిని బాధ్యులుగా చేసారు, చేయకపోతే ఎందుకు చేయలేదు అనేది అత్వవసరంగా సమాధానం చెప్పాల్సిన అత్యవసర అంశాలు..!
ఇక్కడ మనమంతా గుర్తించాల్సిన,గుర్తుంచుకోవాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ NDDB ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడా కాంక్రీట్ గా శ్రీవారి లడ్డూ తయారీలో ఫిష్ లేదా బీఫ్ ఆయిల్ కల్సినట్లు చెప్పలేదు..ధృవీకరించలేదు. నెయ్యి నాణ్యతను S వ్యాల్యూ నిర్ధారిస్తుంది కనుక… ఘీ శాంపిల్ లో S వాల్యూ తక్కువగా ఉన్నట్టు గుర్తించామని, కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పింది. ఒకవేళ ఇదే నిజం, ఇదే నిజం అనుకున్నా కూడా… ఈ ఫలితమే చివరిది, ఈ ఫలితమే నిజమైనది అని ధృడంగా చెప్పలేదు కూడా..! ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ రిజల్ట్స్‌తో NDDB CALF రిపోర్ట్ పై అనేక సందేహాల మేఘాలు కమ్ముకున్నాయి. NDDB CALF అంటే నమ్మకానికి చిరునామా , క్రెడిబిలిటీకి కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు చెప్పలేక, చెప్పుకోలేకపోతోంది అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు AR DIARY కూడా స్పందించింది. రెస్పాండ్ అయింది అనటం కంటే AR DIARY సవాల్ విసిరింది అనే చెప్పాలి. మేము ఎలాంటి తప్పు చేయలేదు. జులై నెలలో మొత్తం 16 టన్నుల నెయ్యి సరఫరా చేసాము. మేము సప్లై చేసిన నెయ్యిలో ఏ కల్తీ జరగలేదు. ఇందుకు ఈ రిపోర్ట్ సాక్ష్యం అంటూ రిపోర్ట్ ను కూడా రిలీజ్ చేసింది AR DIARY. అయినా సరే మీకు నమ్మకం లేకపోతే… ఏ విచారణకు అయినా సరే మేము సిద్ధం అంటున్నారు ఏఆర్ డెయిరీ ప్రతినిధులు..
విన్నారుగా AR DIARY ప్రతినిధుల క్లారిటీ బైట్. వీళ్లు మాత్రమే కాదు మాజీ CM జగన్ కూడా నిజాలను నిగ్గు తేల్చాలని,దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో స్వయంగా సుప్రీం చీఫ్ జస్టిస్‌కు, ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అలా వీలు కాకుంటే విచారణ కమిటీని నియమించి నిజాలను నిగ్గుతేల్చండి అంటూ ధర్మాసనాన్ని కోరారాయన. స్పందించిన ఏపీ హైకోర్ట్ ధర్మాసనం వచ్చే బుధవారం విచారణ జరపనుంది. ఇదిలా ఉంచితే… కోటానుకోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలను, అంతకుమించి పరమ పావనమైన తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం CBI ఎంక్వైరీకి ఆదేశించటం లేదనేది చిదంబర రహస్యంగా మిగిలిపోతోంది. ల్యాబ్ రిపోర్ట్ ను మాత్రమే ఎందుకు ఫైనల్‌గా తీసుకుంటున్నారు..CBI ఎంక్వైరీ వేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా, లేదా రిటైర్డ్ కానీ, సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తే… దోషులు ఎవరో క్లియర్ కట్ గా తేలిపోతుంది కదా? అప్పుడు సాక్షాత్తూ శ్రీవారినే అత్యంత బాధ్యతారాహిత్యంగా అవమానించిన, ఆగమశాస్త్ర నియమ నిబంధనలను కాలరాసిన దుర్మార్గుల అంతు చూడవచ్చు కదా.. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత తాత్సారం చేస్తుందనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ప్రమాణాలు,ఆరోపణలు,ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు కాకుండా… సమగ్ర న్యాయవిచారణ వైపుగా సీఎం చంద్రబాబునాయుడు అడుగు వేయాలనేది శ్రీవారి భక్తులు మాత్రమే కాదు అఖండ హిందు సమాజం చేస్తున్న డిమాండ్ కూడా !