షిప్ వెళ్ళిపోయింది మావా, సీజ్ లేదు బొక్క లేదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిపివేయాలన్న ఈస్ట్ ఆఫ్రికా షిప్ కి విముక్తి లభించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందనే ఆరోపణపై కాకినాడ పోర్ట్ లో నవంబర్ 28 న నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్ కు కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిపివేయాలన్న ఈస్ట్ ఆఫ్రికా షిప్ కి విముక్తి లభించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందనే ఆరోపణపై కాకినాడ పోర్ట్ లో నవంబర్ 28 న నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్ కు కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించింది పవన్ సీజ్ ది షిప్ డైలాగ్. షిప్ నుంచి 1320 టన్నుల బియ్యాన్ని కాకినాడ గౌడౌన్స్ కి తరలించిన ప్రభుత్వం.. దీనికి సంబంధించి శ్రీ సత్యం బాలాజీ ఎక్స్ పోర్టర్స్ పై కేసు నమోదు చేసింది.
బియ్యం షిప్ నుంచి తీసేయడం తో షిప్ కి ఆటంకాలు తొలిగాయి. షిప్ ని సీజ్ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని రాష్ట్రప్రభుత్వానికి తేల్చి చెప్పిన కస్టమ్స్… క్లియరెన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బియ్యాన్ని మాత్రం తరలించి కేసు నమోదు చేసారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తికావడం తో ఈస్ట్ ఆఫ్రికా కి మిగిలిన ఎగుమతులతో షిప్ బయల్దేరింది.