BJP MP Candidates List : ఇలా వచ్చి… అలా టిక్కెట్… బీజేపీలో కొత్తవాళ్ళకి ఛాన్స్ … !
బీజేపీ (BJP) రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటుదక్కింది. ఆదిలాబాద్ - గోడెం నగేశ్, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మెదక్ - రఘునందన్‌రావు (Raghunandan Rao), నల్గొండ- శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.

2024 Telangana BJP Lok Sabha Elections Central BJP allotted ticket to newcomers
బీజేపీ (BJP) రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటుదక్కింది. ఆదిలాబాద్ – గోడెం నగేశ్, పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్, మెదక్ – రఘునందన్‌రావు (Raghunandan Rao), నల్గొండ- శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. ఇంకా ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల (BJP Lok Sabha Candidates) రెండో జాబితా విడుదలైంది. తెలంగాణ నుంచి ఇందులో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయబోతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తారు.
తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ లకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని పక్కన పెట్టింది. ఈ స్థానంలో కొత్తగా చేరిన నగేశ్ కు అవకాశం ఇచ్చింది. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండు సీట్లలోనూ బయట నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. రెండు జాబితాల్లో కలిసి ఏడుగురు ఈమధ్యనే బీజేపీలో జాయిన్ అయిన వారున్నారు.
ఇక బీజేపీ ప్రకటించిన 15 స్థానాల్లో 5 బీసీ, 6 ఓసీలు, ఎస్సీ,ఎస్టీలకు రెండు చొప్పున నాలుగు స్థానాలు కేటాయించారు. మహబూబ్ నగర్ , మెదక్ స్థానాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇచ్చారు. జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ మహబూబ్ నగర్ సీట్ కోసం ప్రయత్నించినా డీకే అరుణ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది.