REVANTH PAI NIGHA : రేవంత్ పై 24 గంటలు నిఘా.. 25 మందితో స్పెషల్ టీమ్
తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్ గా అప్పటి BRS ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది.
తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్ గా అప్పటి BRS ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. రేవంత్ పీసీసీ ( Revanth Reddy PCC) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి BRS పెద్ద నేతల్లో టెన్షన్ మొదలైంది. అప్పటి నుంచే ఆయన కదలికపై అడుగడుగునా నిఘా స్టార్ట్ అయింది.
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. ఎవరిని కలుస్తున్నారు. అంటూ ప్రతి క్షణం వివరాలు తెలుసుకున్న SIB టీమ్ ఆ డిటైల్స్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు అందించింది. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టారు. రేవంత్ PCC చీఫ్ అయ్యాక ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినట్టు దర్యాప్తు బృందం దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఎవరెవరు సాయం చేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని BRS ప్రభుత్వ పెద్దలకు టీమ్ సమాచారం పంపింది. రేవంత్ కుటుంబ సభ్యుల కదలికలపైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించారు. అలాగే ఈటెల రాజేందర్ BRS పార్టీకి రిజైన్ చేసి… బయటకు వచ్చిన మరుక్షణం నుంచి… ఆయనపైనా 24 గంటలు నిఘా పెట్టింది అప్పటి KCR సర్కార్. ఈటెలతో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పంజాగుట్ట పోలీసులు… నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి, సంతోష్ రావు, నవీన్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ లీడర్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. అలాగే IPDRతో హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటాను రీట్రీవ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. స్నాప్ చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ ల నిర్వాహకులకు నోటీసులిచ్చారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు అక్రమ దందాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.
టాస్క్ ఫోర్స్ బాస్ గా పోలీస్ పవర్ ను అడ్డం పెట్టుకొని లక్షలు, కోట్ల రూపాయల్లో దందాలు చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. రాధాకిషన్ జైలు పాలవడంతో… బాధితులు ఒక్కొక్కరుగా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కంప్లయింట్స్ పరిశీలించి, సాక్షులను విచారిస్తున్నారు పోలీసులు.
ఈ కేసులో న్యాయపరమైన సవాళ్ళను ఎదుర్కొడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా ప్రభుత్వం నియమించింది. పోలీసులు కోరిన వెంటనే సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ పీసీ నియామకంపై పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుల్లో మెమో దాఖలు చేశారు.