కెనడాలో కేసీఆర్‌కు 45 ఎకరాల ఫాం హౌజ్‌

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తాను సీఎంగా ఉన్న టెన్యూర్‌లో అక్రమంగా వేల కోట్లు సంపాదించారు అనేది ప్రత్యర్థులు ఆరోపణ. ముఖ్యంగా కాళేశ్వరం పార్జెక్ట్‌లో నిధులు మళ్లించి వేల కోట్లు కల్వకుంట్ల కుటుంబం కొట్టేసింది అనేది ప్రధాన ఆరోపణ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 02:45 PMLast Updated on: Sep 16, 2024 | 2:45 PM

45 Acre Farm House For Kcr In Canada

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తాను సీఎంగా ఉన్న టెన్యూర్‌లో అక్రమంగా వేల కోట్లు సంపాదించారు అనేది ప్రత్యర్థులు ఆరోపణ. ముఖ్యంగా కాళేశ్వరం పార్జెక్ట్‌లో నిధులు మళ్లించి వేల కోట్లు కల్వకుంట్ల కుటుంబం కొట్టేసింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుతో కేసీఆర్‌ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు అని కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు ఆయనను విమర్శించారు. కానీ కేసీఆర్‌ తన ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు క్లియర్‌గానే ఉంచుతూ వచ్చారు. తనకు నంది హిల్స్‌లో ఉన్న ఇల్లు, ఎర్రవెళ్లిలో ఉన్న ఫాంహౌజ్‌ తప్ప పెద్దగా ఆస్తులు లేవని తన ఎలక్షన్‌ అఫిడవిట్‌లో కూడా చెప్పారు.

కానీ కేసీఆర్‌కు కెనడాలో 45 ఎకరాల ఫాంహౌజ్‌ ఉంది అనే వార్త ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. వివిధ దేశాలు తిరుగుతూ వ్లాగ్‌లు చేసే ప్రముఖ యూట్యూబర్‌ నా అన్వేషణ అన్వేష్‌ చేసిన ఓ వీడియో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఫాంహౌజ్‌ను వీడియో తీయడానికి అన్వేష్‌ వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ వ్యక్తి ఇంటితో పాటు ఇంట్లో సామాన్లు వెనకాల ఫాం గురించి కూడా పూర్తి వివరాలు చెప్పాడు. ఈ ఫాంహౌజ్‌పక్కనే కేసీఆర్‌కు కూడా ఫాంహౌజ్‌ ఉందని.. కెనడాలో కేసీఆర్‌ 45 ఎకరాల ఫాంహౌజ్‌ కొన్నాడని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బంతా విదేశాల్లో ఇలా పెట్టుబడులు పెట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. మరి దీనపై బీఆర్ఎస్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.