ప్రవీణ్‌ పగడాల మృతిపై 5 అనుమానాలు…!

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రవీణ్‌ ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు వివరించే ప్రయత్నం చేస్తుంటే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 01:36 PMLast Updated on: Mar 26, 2025 | 1:36 PM

5 Suspicions Over Praveen Pagadalas Death

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రవీణ్‌ ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు వివరించే ప్రయత్నం చేస్తుంటే.. ఆయన మద్దతుదారులు మాత్రం.. ఎవరో ప్రవీణ్‌ను చంపేశారని అంటున్నారు. వీటికి తోడుగా ప్రవీణ్‌కు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కనిపిస్తున్న సీన్స్‌ కూడా ఇప్పుడు అనేక అనుమానాలాకు తావిస్తున్నాయి. ప్రవీణ్‌కు నిజంగా ప్రమాదమే జరిగిందా.. లేక ఎవరైనా ఆయనపై దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ప్రవీణ్‌ ప్రయాణం చేసిన దారిలో సీసీ ఫుటేజ్‌ను సేకరించారు.

టోల్‌ గేట్‌ దాటుతున్న సమయంలో బైక్‌కు హెడ్‌ లైట్‌ వేసుకోకుండానే ప్రవీణ్‌ టోల్‌ గేట్‌ క్రాస్‌ చేశారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో వీడియోలో ఆయనకు ఓ లారీ అడ్డు వచ్చింది. అది వెళ్లేలోగా ప్రవీణ్‌కు ప్రమాదం జరిగింది. ఆ గ్యాప్‌లో ప్రవీణ్‌ బైక్‌ స్కిడ్‌ అయ్యి పడిపోయాడా లేక ఎవరైన ప్రవీణ్‌ను ఎవరైనా వాహనంతో ఢీ కొట్టారా అనేది అర్థం కావడంలేదు. ఇక ప్రమాదం జరిగినప్పుడు ప్రవీణ్‌ హెల్మెట్‌ పెట్టుకున్నాడు. కానీ ఆయన డెడ్‌బాడీని స్థానికులు గుర్తించినప్పుడు ఆయన మొహానికి తీవ్ర గాయాలున్నాయి.

హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి మెహానికి గాయాలు ఎలా అవుతాయని ప్రవీణ్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. అక్కడే ఉన్న ఓ కర్రకు ప్రవీణ్‌ రక్తపు మరకలు ఉన్నాయి. అంతే కాదు ప్రమాదం జరిగిన స్పాట్‌కు రోడ్డు అవతల ఓ పెట్రోల్‌ బంక్‌ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పెట్రోల్‌ బంక్‌ ఫుటేజ్‌ ఇవ్వడంలేదని ప్రవీణ్‌ మనుషులు చెప్తున్నారు. ఇవన్నీ చూశాక.. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్‌ కాదని చెప్తున్నారు ప్రవీణ్‌ సన్నిహితులు. ఆయన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ మీదే ఇప్పుడు నిజం ఆధారాపడి ఉంది. మరో పక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాస్టర్ల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై రియాక్ట్‌ అయ్యింది.

వెంటనే సమగ్ర విచారణ జరిపాలంటూ హోం మినిస్టర్‌ అనిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రవీణ్‌ విషయంలో ఏదైనా కక్షపూరిత వ్యవహారం జరిగి ఉంటే ఖచ్చితంగా నిందితుల అంతు చూస్తామంటూ నారా లోకేష్‌ కూడా హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ప్రవీణ్‌ కాల్‌ డేటా కూడా చెక్‌ చేస్తున్నారు. ఈ ఆధారాలన్నీ ఎలా ఉన్నా.. ప్రవీణ్‌ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌తో ఈ కేసులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.