టార్గెట్ రీచ్ అవుతున్న ఏపీ పోలీసులు, సజ్జల బుక్ అయ్యాడా…?
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్ళు సోషల్ మీడియా విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్ళు సోషల్ మీడియా విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగం చీఫ్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు ఏపీ పోలీసులు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సంచలనం అవుతోంది.
సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేసారు. దూషణలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న భార్గవ్ రెడ్డి… అధికారపార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్రస్థాయి నేత అర్జున్ రెడ్డిపై కేసు నమోదు అయింది.
ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసారు. జగన్ వ్యతిరేకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వర్రా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. పోస్టులపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఫిర్యాదు చేసాడు. బాధితుడు హరి ఫిర్యాదు మేరకు ముగ్గురిపైనా కేసు నమోదు చేసారు పోలీసులు.