లగచర్ల కేసు: అరెస్ట్ లు ఆగవా…?
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల దాడి కేసులో పోలీసుల అదుపులో మరో 10 మంది నిందితులు ఉన్నట్టు తెలుస్తోంది.

లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల దాడి కేసులో పోలీసుల అదుపులో మరో 10 మంది నిందితులు ఉన్నట్టు తెలుస్తోంది. పదిమంది నిందితులను గోప్యంగా ఉంచి విచారిస్తున్న పోలీసులు.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. వీడియోల ఆధారంగా దాడిలో ఉన్నటువంటి వారిని పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దాడి జరిగిన రోజు వీడియోల ఆధారంగా ఘటనకు పాల్పడిన వారిని గుర్తిస్తున్న పోలీసులు.. నరేందర్ రెడ్డి మొబైల్ ఫోన్ ను పరిశీలిస్తున్నారు. నరేందర్ రెడ్డి కాల్ డేటా.. వాయిస్ మెసేజ్లను పోలీసులు పరిశీలించారు. మరోవైపు కీలక నిందితుడు సురేష్ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. సురేష్ వెనుక కీలక వ్యక్తులు ఉన్నారనే అనుమానంతో అతని కోసం నాలుగు బృందాలు గాలింపు చేపట్టాయి.