సిటీ శివారులో బడా ఫామ్‌హౌస్.. బెట్టింగ్ పైసలేనా.. జ్యోతక్కా?
తెలుగు స్టేట్స్‌లో ఇప్పుడు ఏ న్యూస్ ఛానెల్ చూసినా.. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా ట్రెండ్ అవుతున్న విషయం ఒక్కటే. బెట్టింగ్ యాప్స్. అమాయకపు ప్రజలను బెట్టింగ్ ఉచ్చులో పడేసి సెలబ్రిటీలు మాత్రం ప్రమోషన్స్ పేరుతో కోట్లు వెనకేశారని అంతా

తెలుగు స్టేట్స్‌లో ఇప్పుడు ఏ న్యూస్ ఛానెల్ చూసినా.. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా ట్రెండ్ అవుతున్న విషయం ఒక్కటే. బెట్టింగ్ యాప్స్. అమాయకపు ప్రజలను బెట్టింగ్ ఉచ్చులో పడేసి సెలబ్రిటీలు మాత్రం ప్రమోషన్స్ పేరుతో కోట్లు వెనకేశారని అంతా మాట్లాడుకుంటున్నారు. వంద రూపాయల ఆశ చూపించి.. లక్ష రూపాయలు లాక్కోవడం.. వాళ్ల బతుకులను రోడ్డు మీద పడేయడం. సింపుల్‌గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ దందా ఇదే. అలాంటి యాప్‌లకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఏంటని ఇప్పుడు అధికారులతో పాటు ఆడియన్స్‌లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకరి తారువాత ఒకర్ని విచారణకు పిలుస్తున్నారు. కానీ బిగ్‌బాస్ ఫేం శివజ్యోతి అలియాస్ సావిత్రక్క మీద మాత్రం పోలీసులు ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు. ఇదే విషయంలో చాలా మంది పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. ఆమెకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంతో సంబంధం ఉన్నా.. పోలీసులు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వ్యవహారం మొత్తం పక్కన పెడితే సిటీ శివార్లలో ఉన్న ఓ ఫాంహౌజ్ శివజ్యోతి కొనుగోలు చేసింది అనే వార్త ఇప్పుడు మీడియా వర్గాలతో పాలు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. మీడియా ఛానెల్‌లో సావిత్రక్క అనే క్యారెక్టర్ వచ్చే వరకూ శివజ్యోతి ఎవరో ఎవరికీ తెలియదు. ఆ క్యారెక్టర్‌తో శివజ్యోతి ప్రపంచానికి పరిచయం అయ్యింది. మీడియా ఛానెల్‌లో వచ్చే జీతంలో హైదరాబాద్‌లో ఇంటిని మెయిన్‌టేన్ చేయడమే చాలా కష్టం. మిడిల్ క్లాస్‌కు చెందిన భార్యా భర్తలు ఇద్దరూ జాబ్ చేసినా.. ఓ ఇల్లు కొనుక్కోవడం కూడా కష్టమే. అలాంటి మిడిల్ క్లాస్ నుంచే వచ్చింది శివజ్యోతి. తనది మిడిల్ క్లాస్ అని ఆమే చాలా సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంది. కానీ ఇప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి చూసి ఆమెతో పని చేసినవాళ్లే షాకవుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో తనతో వర్క్ చేసిన ఏ ఒక్కరూ కొనలేని కార్లు బంగ్లాలు కొనుగోలు చేసింది జ్యోతక్క. సెలబ్రెటీలు వాడే BMW కారు వాడుతోంది.
ఖరీదైన విల్లాలో ఉంటోంది. సావిత్రక్క లైఫ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. బ్రేక్‌ఫాస్ట్ బాలిలో చేస్తే.. లంచ్ గోవాలో చేస్తోంది. వారినికో డొమెస్టిక్ టూర్, నెలకో ఇంటర్నేషన్ టూర్ అంటూ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇవన్నీ వ్లాగ్‌లుగా చేసి యూట్యూబ్ నుంచి రెవెన్యూ సంపాదిస్తోందా అంటే.. యూట్యూబ్ నుంచ్చి వచ్చే ఇన్‌కం వాళ్ల ఫ్లైట్ టికెట్స్‌కి కూడా సరిపోదు. కానీ జ్యోతక్క మాత్రం తగ్గేదే లే అన్నట్టు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇక్కడ ఆమె లైఫ్ ఎంజాయ్ చేస్తే ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. కానీ ఇంత తక్కువ టైంలో శివజ్యోతికి ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ హాట్ టాపిక్. ఇక్కడ మరో హైలెట్ ఏంటి అంటే. గచ్చిబౌలి నుంచి సరిగ్గా గంట దూరంలో శాద్‌నగర్‌లో ఓటీపీ పేరుతో ఓ ఫాంహౌజ్ ఉంది. సిటీ శివార్లలలో ఉన్న లగ్జరీయస్ ఫాంహౌజ్‌లలో ఇది కూడా ఒకటి. రీసెంట్‌గా శివజ్యోతి ఇక్కడ తన భర్త పోస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ కూడా చేసింది.
ఈ సెలబ్రేషన్ సంగతి పక్కన పెడితే.. ఈ ఫాంహౌజ్ శివజ్యోతిదే అనే గుసగుసలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రాపర్టీ మెయిన్‌టేన్ చేసేది వేరే వ్యక్తులే అయినప్పటికీ.. పెట్టుబడి మొత్తం పెట్టింది శివజ్యోతే అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత తక్కువ కాలంలో ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారానే శివజ్యోతి ఈ స్థాయిలో సంపాదించింది అనే ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల.. ఇలా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీల మీద కూడా కేసు ఫైల్ అయింది. వాళ్లు కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క శివజ్యోతి ఆస్తుల మీద కూడా పోలీసులు నజర్ ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి కేసులు నమోదు చేసిన వెంటనే చాలా మంది సెలబ్రిటీలు బయటికి వచ్చి ఏదో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ వ్యవహారంలో తన పేరు వచ్చినా ఇప్పటి వరకూ శివజ్యోతి మాత్రం బయటికి రాలేదు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. మరి వ్యవహారంతో అక్కకు సంబంధం ఉందా లేదా.. ఈ ఆస్థులన్నీ మీడియాలో కష్టపడి సంపాదించినవేనా సావిత్రక్కే సమాధానం చెప్పాలి.