దిమ్మ తిరిగే ట్విస్ట్, బఫర్ జోన్‌లో హైడ్రా రంగనాథ్ ఇల్లు ?
హైదరాబాద్ రియల్టర్ల గుండెల్లో హైడ్రా పెట్టిస్తున్న పరుగులు అన్నీ ఇన్నీ కాదు. కేవలం రియల్టర్లకే కాదు.. తెలిసీ తెలియక బఫర్ జోన్, FTL పరిధిలో ఇళ్లు కొనుక్కున్న కామన్ పీపుల్ కూడా హైడ్రా పేరు చెప్తేనే వణికిపోతున్నారు.
హైదరాబాద్ రియల్టర్ల గుండెల్లో హైడ్రా పెట్టిస్తున్న పరుగులు అన్నీ ఇన్నీ కాదు. కేవలం రియల్టర్లకే కాదు.. తెలిసీ తెలియక బఫర్ జోన్, FTL పరిధిలో ఇళ్లు కొనుక్కున్న కామన్ పీపుల్ కూడా హైడ్రా పేరు చెప్తేనే వణికిపోతున్నారు. బఫర్ జోన్, FTL పరిధిలో ప్రాపర్టీ ఉందని తెలిస్తే చాలు.. ముందూ వెనకా ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అవతల పర్సన్ ఎవరు.. ఎలాంటి వాళ్లు.. ఎలాంటి బ్రాగ్రౌండ్ ఉంది అని కూడా చూడకుండా తొక్కి పడేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆస్తులు, ఇళ్లు టచ్ చేయడంలేదు అనే విమర్శలు ఉన్నప్పటికీ.. హైడ్రా స్పీడ్ మాత్రం తగ్గడంలేదు. హైకోర్టు నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. రంగనాథ్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కానీ.. అలాంటి రంగనాథ్ స్వయంగా తన ఇల్లే బఫర్ జోన్‌లో కట్టారని బాంబు పేల్చారు.. మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో రంగనాథ్ ఇల్లు ఉంది. ఆ ఇల్లు బఫర్‌జోన్‌లోనే ఉంది అనేది జడ్సన్ చేస్తున్న ఆరోపణ. ఆరోపణ కాదు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు జడ్సన్.
ఎక్కడికి వచ్చైనా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూపిస్తున్నారు. బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను ముందూ వెనకా ఆలోచించకుండా కూల్చేస్తున్న రంగనాథ్.. తన ఇంటిని ఎప్పుడు కూల్చేస్తారో చెప్పాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడికి వచ్చైనా చర్చించేందుకు, నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని పేదల ఇళ్లు మాత్రమే హైడ్రా కూల్చేస్తోందని.. కాంగ్రెస్ నేతలు, వాళ్ల అనుచరుల ఇళ్లు మాత్రం కూల్చడంలేదని ఆరోపిస్తున్నారు. రంగనాథ్ నిజాయితీపరుడు ఐతే ప్రతీ ఒక్కరి విషయంలో సమన్యాయం పాటించాలని విమర్శిస్తున్నారు. హైడ్రా ప్రారంభించిన ఆలోచన మంచిదే అయినప్పటికీ.. రాను రాను హైడ్రానే కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర అస్త్రంగా మారుతోందని చెప్తున్నారు. ముందు బఫర్‌జోన్‌లో ఉన్న రంగనాథ్ ఇల్లు కూల్చిన తరువాత మిగతా వాళ్ల ఇళ్లు కూల్చాలని డిమాండ్ చేస్తున్నారు. జడ్సన్ దగ్గర ఉన్న ఆధారాలేంటి అనే విషయం పక్కన పెడితే.. రంగనాథ్ గురించి ఆయన చేస్తున్న ఈ ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.