ఏపీలో మందుబాబులకు పండగే…

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసి అమలులోకి రానుంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీ కి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 11:12 AMLast Updated on: Oct 01, 2024 | 11:12 AM

A New Liquor Policy Will Be Implemented In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసి అమలులోకి రానుంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీ కి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. ఈనెల 11న లాటరీ నిర్వహిస్తుంది ప్రభుత్వం. మరుసటి రోజు నుంచే అంటే 12 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో ప్రీమియం స్టోర్ లు ఏర్పాటు చేస్తారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ వసూలు చేస్తారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుమును ప్రభుత్వం వసూలు చేసింది. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేయనున్నారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాల్సి ఉంది. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి తో ఏడాదికి కోటి రూపాయల లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు.