AP Politics : కేశినేని కథలో కొత్త ట్విస్టులు.. నాని ఏం చేయబోతున్నారు.
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అటు వైసీపీతో పాటు.. ఇటు టీడీపీలోనూ నాయకుల తీరు.. ఆసక్తి రేపుతోంది. సీటు రాలేదని, టికెట్ దక్కలేదని వైసీపీలో నేతలు రాజీనామాలు చేస్తుంటే.. టీడీపీలో అసంతృప్తులు సెగలు రేపుతున్నాయ్. కేశినేని నాని వ్యవహారం.. సైకిల్ పార్టీ నేతలను పెడుతున్న అంతా ఇంతా కాదు. టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో విజయవాడ కీలకమైన స్థానం.
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అటు వైసీపీతో పాటు.. ఇటు టీడీపీలోనూ నాయకుల తీరు.. ఆసక్తి రేపుతోంది. సీటు రాలేదని, టికెట్ దక్కలేదని వైసీపీలో నేతలు రాజీనామాలు చేస్తుంటే.. టీడీపీలో అసంతృప్తులు సెగలు రేపుతున్నాయ్. కేశినేని నాని వ్యవహారం.. సైకిల్ పార్టీ నేతలను పెడుతున్న అంతా ఇంతా కాదు. టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో విజయవాడ కీలకమైన స్థానం. ఐతే ఇక్కడ ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నయ్. ఎంపీ కేశినేని నాని రాజీనామా నిర్ణయం వేళ.. పార్టీ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. చంద్రబాబు.. తిరువూరు సభకు హాజరయ్యారు. కేశినేని నానికి ఆహ్వానం పలికారు. ఈ సమయంలోనే కేశినేని నాని తన భవిష్యత్ నిర్ణయం ఏంటో క్లియర్‌కట్‌గా చెప్పేశారు. చేయడం ఆలస్యం అవుతుందేమో కానీ.. చేయడం మాత్రం గ్యారంటీని రాజీనామా వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఎంపీ కనకమేడలతో భేటీలోనూ రాజీనామా చేసేందుకే నిర్ణయించుకున్నట్లు చెప్పేశారు. దీంతో కేశినేని నాని టీడీపీ వీడటం ఖాయమైంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వటం లేదని.. స్వయంగా నాని చెప్పారు. ఐతే తాను ఏ పార్టీలో చేరుతాననేది అనుచరులతో చర్చించిన తర్వాత అనౌన్స్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇక అటు వైసీపీ నేతలతో నాని సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనతో వైసీపీ ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. కేశినేని నాని వైసీపీలో చేరే అవకాశం ఉందా అనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. నానితో రాజ్యసభ సభ్యులు కనకమేడల సమావేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయ్. తిరువూరు సభలో నానికి ప్రత్యేకంగా సీటు కేటాయించారు. ఐతే ఆయన హాజరు కాలేదు. తాను పార్టీనే వద్దనుకున్న తర్వాత.. ప్రోటోకాల్ ఏంటంటూ నాని ట్విస్ట్ ఇచ్చారు.
వచ్చేవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత.. తన అనుచరులతో నాని సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి సమయంలో తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఐతే నాని వైసీపీ వైపు చూస్తారా.. లేదంటే స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనేది ఆసక్తి రేపుతోంది.