Top story: రాధాకృష్ణ..నువ్వో పెద్ద బ్లాక్ మెయిలర్… రాధాకృష్ణ వర్సెస్ విజయసాయి

తెలుగు మీడియా దిగ్గజం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ, వైసీపీ రాజ్యసభ సభ్యులు రాధాకృష్ణ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. నీ చరిత్ర ఇదిగో అని రాధాకృష్ణ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించారు. దీనికి అదే స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2024 | 12:03 PMLast Updated on: Nov 23, 2024 | 12:09 PM

Abn Radhakrishna Vs Ysrcp Mp Vijayasai Reddy

తెలుగు మీడియా దిగ్గజం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ, వైసీపీ రాజ్యసభ సభ్యులు రాధాకృష్ణ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. నీ చరిత్ర ఇదిగో అని రాధాకృష్ణ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించారు. దీనికి అదే స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదిగో అవినీతి చరిత్ర అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. రాధాకృష్ణకు మైండ్ బ్లాంకయ్యేలా…సోషల్ మీడియా వేదికగా దశాబ్దాల చరిత్రను తిరగతోడారు. నాతో పెట్టుకోకు…అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలకు…ఇంకా చెప్పాలంటే మీడియా ప్రపంచానికి తెలియని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసి…కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ…చీకటి బాగోతం ఇదిగో అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించారు.

గత శనివారం కొత్త పలుకులో…ఎంపీ విజయసాయిరెడ్డిని ఉతికికారేశారు ఏబీఎన్ రాధాకృష్ణ. నీది ఒక మనిషి పుట్టుకేనా విజయసాయి….మనిషివే అయితే ఐదే నాతో చర్చ కు రా.. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు ? ఎందుకు వచ్చావో చెప్పనా ? ఎవరు పంపిస్తే వచ్చావో చెప్పనా ? నా ముందు ఏం మాట్లాడవో చెప్పనా ? అంటూ అనేక ప్రశ్నలు సంధించారు. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని బెదిరించే ధోరణితో…బ్లాక్ మెయిల్ చేసేలా కథనాన్ని ప్రచురించారు. అక్కడితో ఆగని రాధాకృష్ణ…నమ్మలేని రాజకీయ నాయకుడు అంటూ బీజేపీ పెద్దలు అన్నది నిజం కాదా అంటూ రెచ్చిపోయారు. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే రాధాకృష్ణ అసలు పడదు. వారిద్దరి పేర్లు ఎత్తితే…కోపం నషాళానికి చేరుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్…ఇద్దరు కూడా అధికారంలో ఉన్నంత కాలం…ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ముప్పుతిప్పలు పెట్టారు. పలు ప్రాంతాల్లో ఛానల్ రాకుండా కేబుల్ కట్ చేయించారు. న్యాయస్థానంలో పోరాడి గెలిచారు. అంతలా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ పై కూడా….విజయసాయిరెడ్డి మీద రాసినట్లు రాయలేదు. అటు జగన్మోహన్ రెడ్డి దుష్టచతుష్టయంతో పోల్చినా…రాధాకృష్ణ తన ధోరణితోనే వెళ్లారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం…నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఇంకా చెప్పాలంటే టార్గెట్ చేసుకొని…విజయసాయిరెడ్డిని శకుని మామతో పోల్చారు. ఎన్ని రకాలు తిట్లు ఉంటాయో…అన్ని ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ ఛానల్ లో అన్ని విజయసాయిరెడ్డిపై వాడేశారు. గతవారం కొత్తపలుకు కథనంతో విజయసాయిరెడ్డికి ఎక్కడో కాలింది. అసలే వైసీపీ ఎంపీ…అందులోనూ పార్టీలో నెంబర్-2. రాధాకృష్ణ కథనంపై మూడు రోజులు మౌనంగా ఉండిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటిషియన్లు అంతా…రాధాకృష్ణదే పై చేయి అనుకున్నారు. నిద్రపోయిన సింహాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. అనవసరంగా విజయసాయిరెడ్డిని కెలికారు. నాలుగు రోజుల పాటు రాధాకృష్ణ పాత చరిత్రను తెప్పించుకున్నారు. ఐదో రోజు వరుస ట్వీట్లతో రాధాకృష్ణను ఉక్కిరి చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయంకాతో రాధాకృష్ణను పోల్చారు. 92 సంవత్సరాల ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆస్తులు…నీ నెలరోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోతుందంటూ ట్వీట్ చేశారు. నువ్వు ఎంత అవినీతిపరుడివో వేరే చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు.

మీడియా సంస్థల్లో నష్టాలు వస్తున్నాయని అమెరికా వెళ్తారు. ఎన్నారైల వద్ద చందాలు తెచ్చుకుంటారు. మీ కళ్ళకు కలర్ బ్లైండ్ నెస్ ఉంది. అందువల్ల కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లు మొత్తం నువ్వు ఎలా విమర్శించినా పడుతూ ఉండాలి. నువ్వు సెటిల్మెంట్లు చేస్తే వారు సంపాదనకు ఉపయోగపడాలి అంటూ చెడుగుడు ఆడుకున్నారు. సుద్దులు చెప్పడం మానేయి… నిన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పనిలో పనిగా ఆంధ్రజ్యోతి ప్రస్థానం గురించి ప్రస్తావించారు. పేపర్ కొనడానికి పెట్టబడి పెట్టిన ఇద్దరు వాటాదారులు ఎక్కడున్నారు ? వారిద్దరు ఏమయ్యారు ? బ్లాక్ మెయిల్ చేసి…బయటకు పంపించింది వాస్తవం కాదా అంటూ రాధాకృష్ణ గుడ్డలుడదీసి…జంక్షన్ లో నిలబెట్టేశాడు. ఇప్పుడు రాధాకృష్ణ తన సచ్చీలతను…నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ అసలే విజయసాయిరెడ్డి…ఎంతకైనా దిగజారుతాడు.. ఎంత నీతిమాలిన, దరిద్రపు కామెంట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. అలాంటి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి…స్టోరీ ప్రచురిస్తే ఊరికే ఉంటాడా ? మండదా మరి. అందుకే ఆంధ్రజ్యోతి పునాదుల నుంచి తవ్వుకుంటూ వస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీ యజమాని…నీ మోసపూరిత బుద్ధి గురించి చెబుతుంటాడని ఏబీఎన్ ఎండీ పాత స్నేహితుడ్ని వివాదంలోకి లాగేశారు. న్యాయం, ధర్మం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడొద్దు. సామాజిక స్పృహలని..నీలాంటి దళారులు చిత్ర విచిత్రమైన భ్రమలలో బతుకుతుంటారు. ఎప్పుడో ఒకసారి పెనుగాలి ప్రకంపనగా వీస్తుంది. ఆ గాలికి నామరూపాలు లేకుండా నీలాంటి వాళ్ళు కొట్టుకుపోతారని విజయసాయిరెడ్డి శాపార్థాలు పెట్టారు.

కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ…బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. దీనికి ఎంపీ విజయసాయిరెడ్డి సై అన్నారు. రాధాకృష్ణ..బహిరంగ చర్చకు నేను సిద్ధం…నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్ కౌంటర్ కు సిద్ధంగానే ఉన్నానంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను ఎందుకు రావాలి? . నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సిద్ధమే.. ఎవరి సచ్చీలత ఏమిటో తేలిపోతుంది. గడచిన ఐదు సంవత్సరాలలో మద్యం, ఖనిజం వ్యాపారాలు సాగించే బ్రోకర్లు, ఇతర డీల్స్ లో బాస్ పేరు చెప్పలేదా ? చెప్పి వసూలు చేయలేదా.. వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్ట్ కాలనీ లో నువ్వుండే ప్యాలస్.. నేను ఉండే బాడుగిళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ ప్రధాన రోడ్డులో నువ్వు కొన్న నూరుకోట్ల విలువచేసే స్థలం.. అందులో ఇంకో రెండు వందల కోట్లతో కాడుతున్న కార్యాలయ భవంతి కూడా పరిశీలిద్దామంటూ…రాధాకృష్ణకు మెంటలొచ్చేలా దుమ్ముదులిపాడు. విజయసాయిరెడ్డి వరసగా చేసిన ట్వీట్లు తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డి ట్వీట్లకు రాధాకృష్ణ ఎలా కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.