కేటిఆర్ కు మూడింది.. రంగంలోకి ఏసీబీ…!
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేసారు.
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేసారు. దాన కిషోర్ స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ ప్రారంభించింది ఏసీబీ. దానకిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఫార్ములా-ఈ రేసు కేసులో ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు దానకిషోర్.
ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా వివరాలు తీసుకుని కేటిఆర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేసింది. త్వరలోనే కేటిఆర్ కు నోటీసులు కూడా పంపనున్నారు ఈడీ అధికారులు. ఈ నేపధ్యంలో దాన కిషోర్ ను ఏసీబీ విచారించడం హాట్ టాపిక్ గా మారింది.