బ్రేకింగ్: త్వరలో పాదయాత్ర, కేటిఆర్ సంచలనం
పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. ఎక్స్ లో ప్రజలతో సంభాషించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం అన్నారు.
పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. ఎక్స్ లో ప్రజలతో సంభాషించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది అని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత అని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తాను అని తెలిపారు. కేసీఆర్ గారు సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారు.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ ఆయన మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.