Achari Talloju: పోరాట యోధుడు.. 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ.. అయినా తప్పని ఓటమి..

ఆచారికి కల్వకుర్తిలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్లు కూడా వస్తాయి. కానీ ప్రతీ సారి చిన్న మార్జిన్‌తో పదవిని పోగొట్టుకుంటారు ఆచారి. కరడుగట్టిన బీజేపీ వాది. చాలా కాలం నుంచి ఆచారి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 04:36 PMLast Updated on: Dec 05, 2023 | 4:36 PM

Achari Talloju Defeated Elections For Sixth Time From

Achari Talloju: ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతే చాలు.. రాజకీయాలే వదిలేస్తుంటారు చాలా మంది. ఈ జనం మారరు.. ఈ రాజకీయాలు వద్దు అంటూ వెళ్లిపోతుంటారు. కానీ ఓ పొలిటీషన్‌ మాత్రం ఏకంగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకసారి.. రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఆయనే కల్వకుర్తి బీజేపీ నేత తల్లోజు ఆచారి. ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో ప్రతీ ఎన్నికలో పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ అదృష్టం ఆయనను వరించడంలేదు.

CONGRESS COUNCIL: కౌన్సిల్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టాలే..! బిల్లులు ఆమోదం పొందేది ఎలా..?

ప్రజల్లో ఆదరణ లేని వ్యక్తా అంటే కాదు.. ఆచారికి కల్వకుర్తిలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్లు కూడా వస్తాయి. కానీ ప్రతీ సారి చిన్న మార్జిన్‌తో పదవిని పోగొట్టుకుంటారు ఆచారి. కరడుగట్టిన బీజేపీ వాది. చాలా కాలం నుంచి ఆచారి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారు. మొదటిసారి 1994లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో విజయం వరించలేదు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా కొనసాగారు. తరువాత 2004లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కల్వకుర్తిలో ఆచారికి ఉన్న ఆదరణ చూసి పార్టీ ప్రతీసారి ఆయనకే టికెట్‌ ఇస్తూ వచ్చింది. అప్పటి నుంచి వరుసగా 2009లో, 2014లో, 2018లో పోటీ చేసి ఓడిపోయాడు ఆచారి. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇక 2014లో మరీ దారుణంగా కేవలం 78 ఓట్ల తేడాతో వంశీచంద్‌ చేతిలో ఓడిపోయారు. కౌంటిగ్‌ చివరి వరకూ కూడా దాదాపు ఆచారి గెలిచారని అంతా అనుకున్నారు.

కానీ కేవలం 78 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం అప్పట్లో హాట్‌ టాపక్‌గా మారింది. ఎన్నిసార్లు ఓడినా ఆచారిలో ఎమ్మెల్యే కావాలి అన్న కసి మాత్రం తగ్గలేదు. ప్రతీ ఎన్నికలో పోటీ చేస్తూనే ఉన్నారు. ప్రతీసారి ఓట్‌బ్యాంక్‌ పెంచుకుంటూనే వస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అయినా ఆయనను విజయం వరిస్తుందా లేదా చూడాలి.