ALI YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. పోటీ చేసేది ఎక్కడ..?
అలీకి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ కన్ఫమ్ అన్న టాక్ నడుస్తోంది. అలీ కూడా తాను పోటీకి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నాడు అలీ. గుంటూరు, నంద్యాల లేదా రాజమండ్రి.. వీటిల్లో ఏది ఇస్తారో వేచి చూడాలి.
ALI YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగాలని నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసినందుకు ఆయనకు అడ్వైజర్ పోస్ట్ దక్కింది. అయితే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. ఈ విషయం జగన్ దృష్టికి తెచ్చి కూడా చాన్నాళ్ళయింది. ఆ మధ్య రాజ్యసభ ఇస్తారని పార్టీలో అనుకున్నారు. కానీ ఎందుకో ఛాన్స్ దక్కలేదు.
YS JAGAN: అవ్వ.. తాత.. ఇద్దరికీ పెన్షన్.. సంచలనాలకు కేరాఫ్‌గా జగన్ మేనిఫెస్టో..
ఇప్పుడు అలీకి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ కన్ఫమ్ అన్న టాక్ నడుస్తోంది. అలీ కూడా తాను పోటీకి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నాడు అలీ. గుంటూరు, నంద్యాల లేదా రాజమండ్రి.. వీటిల్లో ఏది ఇస్తారో వేచి చూడాలని కామెంట్ చేశారు. రాప్తాడు సిద్ధం సభ చూశాక.. వైసీపీ విషయంలో జనానికి ఏ మాత్రం అభిమానం తగ్గలేదన్నారు అలీ. రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ గెలిచి మళ్ళీ అధికారం చేపడుతుందని చెప్పారు. అయితే అలీ కోరుకుంటున్నట్టుగా ఆ మూడు నియోజకవర్గాల్లో ఎంపీ టిక్కెట్ ఇస్తారా..? లేదంటే వేరే ఎక్కడైనా అసెంబ్లీకి నిలబెడతారా అన్నది సస్పెన్స్‌గా ఉంది. ఇక నంద్యాలలో అలీని నిలబెడతారన్న టాక్ నడిచింది. అలాగే కడప ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉందని కూడా అన్నారు. కానీ కడపలో ప్రస్తుత ఎంపీ అవినాశ్ రెడ్డినే మళ్ళీ పోటీ చేయించే ఛాన్స్ కూడా ఉంది. కడప ఎమ్మెల్యేగా ప్రస్తుతం అంజాద్ భాష ఉన్నారు.
ఈ సీటును రెడ్డి లేదా బలిజ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. లేదంటే అవినాశ్ రెడ్డిని ఈసారి బరిలోకి దింపకుండా అలీ లేదా అంజాద్ భాషాల్లో ఒకరికి కడప ఎంపీ సీటు ఇచ్చే అంశం కూడా జగన్ పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి వైసీపీ తరపున నటుడు అలీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. కానీ జగన్ ప్రస్తుతం రిలీజ్ చేస్తున్న ఏ లిస్టులో అలీ పేరు వస్తుందో.. ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో మరి.