Acchampet politics : అచ్చంపేట లో ఆగని.. రివెంజ్ పాలిటిక్స్

అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గేదేలా.. అన్నట్టుగా నడుస్తున్నాయి రివెంజ్‌ పాలిటిక్స్‌. నాడు నువ్వు తమలపాకుతో ఒక్కటంటే.. నేడు నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉందట వ్యవహారం. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరున్న సెగ్మెంట్ కావడంతో, గతాన్ని నెమరేసుకుంటూ యాక్షన్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారట స్థానిక అధికార పార్టీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దులోనే పోలీసులు అరెస్టు చేయడం లోకల్‌గా హాట్‌ టాపిక్‌ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 03:25 PMLast Updated on: Dec 20, 2023 | 3:25 PM

Agani In Acchampet Revenge Politics

అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గేదేలా.. అన్నట్టుగా నడుస్తున్నాయి రివెంజ్‌ పాలిటిక్స్‌. నాడు నువ్వు తమలపాకుతో ఒక్కటంటే.. నేడు నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉందట వ్యవహారం. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరున్న సెగ్మెంట్ కావడంతో, గతాన్ని నెమరేసుకుంటూ యాక్షన్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారట స్థానిక అధికార పార్టీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దులోనే పోలీసులు అరెస్టు చేయడం లోకల్‌గా హాట్‌ టాపిక్‌ అయింది.

మరోవైపు అచ్చంపేటకు రాకుండా మరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీక్రిష్ణ స్టేట్ మెంట్స్ ఇవ్వడం అచ్చంపేట రాజకీయాన్ని రక్తికట్టిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ నేతలకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని సలహా ఇస్తున్నారట హస్తం నేతలు. గతంలో జరిగిన అక్రమ అరెస్ట్‌లు తమను పెట్టిన ఇబ్బందుల్ని గుర్తు చేస్తున్నారట. కొట్టాడు.. పడ్డాం.. మా టైమొస్తుంది.. మేము కొడతాం అన్న డైలాగ్‌ని గుర్తు చేస్తున్నాయి స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు. తాజా ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓడి పోయి, కాంగ్రెస్‌ అభ్యర్ది డాక్టర్ వంశీక్రిష్ణ గెలిచారు. ఫలితాలు వచ్చాక పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అచ్చంపేటకు వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును వెల్దండ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆమనగల్ పీఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసి తమ నాయకుడి పర్యటనకు అవకాశం ఇవ్వాలని కోరినా వర్కౌట్‌ కాలేదు. మాజీ ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుని దాడులు చేసే అవకాశం ఉందనే సమాచారంతోనే ముందు జాగ్రత్తగా అరెస్టు చేసామన్నది పోలీసుల వెర్షన్‌.

T CONGRESS: ఓడిపోయినా కూడా వాళ్లే ఎమ్మెల్యేలా..? కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..

ఆ తర్వాత లోకల్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు దూకుడుగా వ్యవహరించి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ముప్పతిప్పలు పెట్టారన్నది అభియోగం. అక్రమ కేసులు పెట్టించి కేడర్‌కు లాఠీ దెబ్బలు రుచి చూపించారన్న ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్ చేసిన ఇతర నియోజక వర్గం వ్యక్తులను కూడా వదల్లేదట గువ్వల. ఆ క్రమంలో సొంత పార్టీ క్యాడర్ కూడా స్వేచ్చగా తమ అభిప్రాయాలను చెప్పే పరిస్థితి లేకుండా నియంత్రించారట. అధికార, అర్దబలంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా గువ్వల వ్యవహించారనేది లోకల్ టాక్ . అందుకే ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల అంశం , కొల్లాపూర్ దగ్గర పాలమూరు ప్రాజెక్టు పరిశీలన సందర్బం, శ్రీశైలం పవర్ హౌజ్ లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్బాల్లో రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ వ్యహారాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ. న్యాయం అన్నది అందరికీ ఒకటే ఉంటుంది అని ఫ్లాష్‌ బ్యాక్‌ని గుర్తు చేస్తున్నారట. బాలరాజు అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరిస్తుండటం.. చూస్తుంటే ముందు ముందు ఈ రివెంజ్‌ పాలిటిక్స్ పీక్స్‌కు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి.. నీ టైం నడుస్తోంది కదా అని విర్రవీగకు, టైం బ్యాడయిందో సీన్ సితారవుతదన్నట్టుగా ఉందట అచ్చంపేట రాజకీయం. ఇవి ఎంతదాకా వెళతాయో చూడాలి.