ఫేక్ సాధు:బయటపడ్డ అఘోరీ బండారం, అబ్బాయిగా ఉన్నప్పటి ఫొటో లీక్
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి అఘోరీ నాగసాధు డ్రా చేస్తున్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ సెలబ్రిటీని చూసేందుకు వచ్చినట్టు జనం పోగవుతున్నారు. వాళ్ల ఆరాటానికి తగ్గట్టుగానే అఘోరీ ఇచ్చే షోఆఫ్ కూడా ఓ రేంజ్‌లో ఉంటోంది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి అఘోరీ నాగసాధు డ్రా చేస్తున్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ సెలబ్రిటీని చూసేందుకు వచ్చినట్టు జనం పోగవుతున్నారు. వాళ్ల ఆరాటానికి తగ్గట్టుగానే అఘోరీ ఇచ్చే షోఆఫ్ కూడా ఓ రేంజ్‌లో ఉంటోంది. లిమిట్స్ దాటి ఈ మధ్య అందరి మీదకి చేతులు కూడా లేపుతోంది. అయితే ఇంత ఓవరాక్షన్ చేసి ఇంత అతిగా మాట్లాడుతున్న ఈ అఘోరీ అసలు బండారం బయట పడింది. ఇంతకాలం ఆమె అందిరికీ చెప్పినట్టు ఆమె చిన్నప్పుడే కేదార్‌నాథ్ వెళ్లి అఘోరాల్లో కలిసిన మనిషి కాదు. ఒక ఏజ్ వచ్చే వరకూ అందరి మధ్యలో మనలాగే పెరిగిన మనిషి. కానీ ఈ విషయాన్ని దాచి పెట్టి ఇంతకాలం ఆమె చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. అందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అఘోరీ ఏం చెప్పిందో మీరే వినండి.
చాలా చక్కగా చెప్పింది కదా. అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి. ఎక్కడో చూసినట్టు ఉంది కదా. ఆ ఫొటోలో ఉంది మన అఘోరీ మేడంగారే. తాను అమ్మాయిగా మారకముందు తీసిన ఫొటో ఇది. అఘోరీ నాగసాధుగా చలామణీ అవుతున్న ఈమె.. సారీ.. ఇతని ప్రాపర్ మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్‌పల్లి. కుషన్‌పల్లి అనే విలేజ్‌లో ఉండే చిన్నయ్య, చిన్నక్క దంపతుల మూడో సంతానం ఈ శ్రీనివాస్. చిన్నయ్యకు మొత్తం నలుగురు పిల్లలు. శ్రీనివాస్ అలియాస్ అఘోరీ చిన్నయ్యకు మూడో కొడుకు. ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తరువాత కేదార్‌నాథ్‌కు వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు. చాలా కాలం నుంచి శ్రీనివాస్ కేదార్‌నాథ్ వదిలి బయటే తిరుగుతున్నాడు. కొంత కాలం అర్థనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు. రీసెంట్‌గా నాగసాధుగా పేరు మార్చుకుని తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు.
హుండై ఐ20 టాప్ ఎండ్ కారు వాడుతున్నాడు, ఐఫోన్ 15 ప్రొమ్యాక్స్ వాడుతున్నాడు. ఇంగ్లీష్‌లో మాట్లాడుతాడు. ఇవన్నీ ఏంటిని ఎవరైనా ప్రశ్నిస్తే గిఫ్ట్ అని చెప్తాడు. లోక కళ్యాణ్ కోసం వచ్చాను.. కొన్ని రోజులకు వెళ్లిపోతాను.. నా కారు ఎవరైనా ఆపితే వాళ్లను భస్మం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ రిజార్జ్‌కి, కారు పెట్రోల్‌కి డబ్బు ఎక్కడివి అంటే భక్తులు గిఫ్ట్ ఇస్తారు అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే రెండు నెలల నుంచి అఘోరీ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నడుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతోంది. తమ దేహం మీద కూడా తమకు మోహం లేకుండా ఉంటారు అఘోరాలు. కానీ ఆమె మాత్రం అనాథ పిల్లలకు అన్నదానం చేస్తానని వెళ్తుంది. ఒక అఘోరీ నుంచి ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటి మెయిటెనెన్స్ దేశంలో బహుశా ఇదే మొదటిసారి. చేసేది మంచే కావొచ్చు. కానీ దానికి అఘోరీ అని పేరు పెట్టుకుని చేయాల్సి పని లేదు. బట్ విషయం ఏదైనా హిందువులు ఎంతో ఎమోషనల్‌గా ఫీలయ్యే సనాతన ధర్మం వాదాన్ని అడ్డుపెట్టుకుని వైరల్ అవ్వడానికి ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఈ ఫొటో చూసినవాళ్లు.