ఏపీకి పొంచి ఉన్న భారీ ముప్పు

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం... చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో ఉందని తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 01:52 PMLast Updated on: Oct 16, 2024 | 1:52 PM

Air Threat To Andhra Pradesh And Tamil Nadu States

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం… చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో ఉందని తెలిపింది. వాయువ్య దిశగా 15కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం ప్రభావం కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తీవ్ర భారీ వర్షసూచన చేసారు.

విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉండాలని సూచించారు. పెన్నా నది పరీవాహక ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతను బట్టి సూచనలు చేసారు.

ఇప్పటికే సహాయక చర్యలకోసం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు కేటాయించారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రకాశం 4, నెల్లూరు 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు. సముద్రంలో వేటకు వెళ్ళిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.