మోహన్ బాబుకు అఖిల ప్రియ షాక్, కర్నూలుకు పాకిన గొడవ
మంచు కుటుంబం వ్యవహారంలో భూమా మౌనిక అత్యంత కీలకంగా మారారు. భూమా మౌనిక కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు మొన్న విడుదల చేసిన ఆడియోలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.
మంచు కుటుంబం వ్యవహారంలో భూమా మౌనిక అత్యంత కీలకంగా మారారు. భూమా మౌనిక కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు మొన్న విడుదల చేసిన ఆడియోలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయడం పట్ల అలాగే మంచు విష్ణు అనుచరులు మంచు మనోజ్ ను తీవ్రంగా గాయపరచడం పట్ల ఇప్పుడు భూమా మౌనిక సీరియస్ గా ఉన్నారు. దీనిపై కర్నూల్ లో కేసు నమోదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
అటు ఆమెపై కూడా మోహన్ బాబు అనుచరులు అలాగే మంచు విష్ణు అనుచరులు దాడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనితో వారిపై కర్నూల్ లో కేసు పెట్టేందుకు భూమా మౌనిక సిద్ధమవుతున్నారు. ఆమె సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విషయంపై ఆమెకు పూర్తి సమాచారాన్ని భూమ మౌనిక అందించారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు భూమా మౌనిక సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సహా పలు కీలక సమావేశాలు ఉండటంతో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారట.
దీంతో చంద్రబాబు నాయుడుని కలిసి కలవడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. పదేపదే భూమ మౌనిక కారణంగానే గొడవలు జరుగుతున్నాయని… మోహన్ బాబు చెప్పడం మీడియాలో కూడా ఆ వార్తలు ఎక్కువగా హైలెట్ కావడం వంటివి. ఇప్పుడు చిరాకుగా మారాయి. అందుకే భూమా కుటుంబం ఈ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం మంచు మనోజ్ పై దాడి చేసిన సమయంలో అడ్డుకోవడానికి వెళ్ళిన మౌనికపై కూడా అనుచరులు దాడి చేసినట్టుగా తెలిసింది.
దీనిపై ఇప్పుడు అఖిలప్రియ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా సమాచారం. ఇక భూమ మౌనికకు మంచు లక్ష్మి నుంచి కూడా మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వీళ్లిద్దరు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారని ఆమె కూడా మంచు విష్ణు పై కేసు పెట్టాలని సలహా ఇచ్చిందంటూ వార్త షికారు చేస్తోంది, మరి మౌనిక కేసు పెడతారా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మోహన్ బాబు పై హత్యాయత్నం కూడా నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు కుటుంబంపై చంద్రబాబు కూడా సీరియస్ గానే ఉన్నారు. గతంలో చంద్రబాబును మోహన్ బాబు ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసారు. జగన్ తో కలిసి డ్రామాలు ఆడారు అనే ఆరోపణలు టీడీపీ చేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం మోహన్ బాబు చంద్రగిరిలో వైసీపీని దెబ్బ కొట్టారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.