Akhilesh Yadav Daughter: యూపీ ప్రచారంలో అదితి ఫిదా.. తల్లి డింపుల్ గెలుపు కోసం తంటాలు

మెయిన్ పురిలో ప్రచారానికి డింపుల్ యాదవ్ తన కూతురు అదితిని కూడా వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. లండన్ లో చదువుకుంటున్న అదితి సెలవుల కోసం యూపీకి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2024 | 11:46 AMLast Updated on: Apr 11, 2024 | 6:13 PM

Akhilesh Yadav And Dimple Daughter Adithi Campaigning For Her Mother

Akhilesh Yadav Daughter: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ములాయం మనుమరాలు, అఖిలేష్, –డింపుల్ కూతురు అదితి ఓటర్లను ఫిదా చేస్తోంది. మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కి మద్దతుగా అదితి క్యాంపెయిన్ చేస్తోంది. తాత వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ… పంచ్ లతో ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేస్తోంది. మెయిన్ పురిలో ప్రచారానికి డింపుల్ యాదవ్ తన కూతురు అదితిని కూడా వెంటబెట్టుకొని తిరుగుతున్నారు.

Kuldeep Sen: మొదట హీరో.. తర్వాత విలన్.. రాజస్థాన్ కొంపముంచిన కుల్దీప్ సేన్

లండన్ లో చదువుకుంటున్న అదితి సెలవుల కోసం యూపీకి వచ్చింది. ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా తాత, తండ్రి రాజకీయ వారసత్వం ఇచ్చిన స్ఫూర్తితో తల్లి కోసం ఎన్నికల ప్రచారం చేస్తోంది. అదితి స్పీచెస్ కు జనం ఫిదా అవుతున్నారు. మూలాయం సింగ్ మూడో తరం రాజకీయ వారసత్వాన్ని ఆమె కంటిన్యూ చేస్తోంది. మెయిన్ పురిలో ములాయం సింగ్ యాదవ్ చనిపోయాక జరిగిన ఉపఎన్నికల్లో ఆమె కోడలు డింపుల్ యాదవ్ గెలిచారు. ఇప్పుడు రెండోసారి బరిలోకి దిగారు. ఉత్తర్ ప్రదేశ్ మొత్తం బీజేపీ గాలి వీస్తుండటంతో డింపుల్ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. అందుకే తన కూతరు అదితిని వెంటబెట్టుకొని వస్తోందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అదితి మాత్రం ఎన్నికల ర్యాలీలో తాత లాగా పదునైన మాటలతో ఆకట్టుకుంటోంది. ఏకంగా పీఎం మోడీనే టార్గెట్ చేసింది అదితి.

రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం లాంటి అంశాలను కూడా లేవనెత్తుతోంది. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల టైమ్ లోనే ఉద్యోగాలు ఇస్తోందనీ…పేపర్లు లీక్ కూడా చేస్తోందని యోగీ సర్కార్ పైనా కామెంట్స్ చేస్తోంది. గత ఎన్నికల్లో ప్రతి ఖాతాలో 14 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు, ఉచిత గ్యాస్ సిలెండర్, పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గిస్తామని బీజేపీ భారీ హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అదితి ఎన్నికల సభల్లో చెబుతోంది. మెయిన్ పురి ఎన్నికల ప్రచారం తర్వాత అదితి యాదవ్ కు సోషల్ మీడియాలో ఫుల్లుగా క్రేజ్ పెరిగింది. ఆమెకు Xలో 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
https://www.youtube.com/watch?v=CYQRS02KsBI