అలెర్ట్: హైదరాబాద్ లో ఈ హోటల్స్ లో తింటున్నారా…?
హైదరాబాద్ లో పలుచోట్ల జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉప్పల్లోని లక్కీ రెస్టారెంట్, సురభి రెస్టారెంట్, ఆల్వాల్ లోని యతిమిలిటరీ హోటల్ తో పాటుపలు ప్రాంతాల్లో దాడులు చేసారు.

హైదరాబాద్ లో పలుచోట్ల జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉప్పల్లోని లక్కీ రెస్టారెంట్, సురభి రెస్టారెంట్, ఆల్వాల్ లోని యతిమిలిటరీ హోటల్ తో పాటుపలు ప్రాంతాల్లో దాడులు చేసారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నారని గుర్తించిన అధికారులు… వెంటనే చర్యలకు దిగారు. చాలాకాలంగా ఫ్రిడ్జ్ లోనే ఉంచిన చికెన్ మటన్ ఇతర పదార్థాలను డస్ట్ బిన్ లో పడేయించారు.
పలుచోట్ల కిచెన్లో బొద్దింకలు, ఎక్స్పైరీ అయిన ముడి సరుకులను గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏ ఐ నిబంధనలు పాటించని హోటల్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు… మార్పు రాకపోతే మాత్రం హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణా ఆరోగ్య శాఖ ఇప్పటికే హోటల్స్ పై ఫోకస్ పెట్టింది. ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు తనిఖీలపై కీలక ఆదేశాలు జారీ చేసారు.